తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నీరజ్​ గోల్డ్ కొడితే రూ.1,00,089 ప్రైజ్‌ మనీ' - వైరల్​గా మారిన పంత్ పోస్ట్​! - Neeraj Chopra Gold Medal - NEERAJ CHOPRA GOLD MEDAL

Paris Olympics 2024 Neeraj Chopra : లక్కీ విన్నర్​కు ప్రైజ్​మనీ అంటూ స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అకౌంట్​లోని ఓ పోస్ట్​ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Paris Olympics 2024 Neeraj Chopra
Paris Olympics 2024 Neeraj Chopra (Etv Bharat)

By ETV Bharat Sports Team

Published : Aug 7, 2024, 12:09 PM IST

Paris Olympics 2024 Neeraj Chopra :పారిస్ ఒలింపిక్స్‌ 2024లో నీరజ్ చోప్రా జావెలిన్‌ త్రో ఈవెంట్​లో ఫైనల్‌కు అర్హత సాధించాడు. గత టోక్యో ఒలింపిక్స్​లో గోల్డ్​ మెడల్​ సాధించిన అతడిపై ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సమయంలో 'నీరజ్​ చోప్రా గోల్డ్​ గెలిస్తే లక్కీ విన్నర్​కు ప్రైజ్​మనీ' అంటూ టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్​ రిషభ్‌ పంత్(Pant Prize Money) ఎక్స్‌ అకౌంట్​లో ఓ పోస్ట్ కనిపించింది​. "నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధిస్తే ఒక లక్కీ విన్నర్‌కు రూ.1,00,089 ప్రైజ్‌ మనీ ఇస్తాను. ఎవరు అయితే లైక్స్‌ ఎక్కువ కొట్టి కామెంట్లు పెడతారో వారికే ఈ ఛాన్స్​. దీంతో పాటే టాప్‌- 10లో ఉన్న వారికి విమాన టికెట్లను ఇస్తాను. భారత్‌ నుంచి మాత్రమే కాదు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా మన నీరజ్​కు మద్దతు ఇవ్వండి" అంటూ ఆ పోస్ట్​లో రాసి ఉంది.

ఈ పోస్ట్​తో పాటు పంత్‌ అకౌంట్​లో పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించి మరో పోస్టు కూడా వచ్చింది. దీంతో రిషభ్‌ పంత్ సోషల్ మీడియా అకౌంట్‌ ఏమైనా హ్యాకింగ్‌కు గురైందా ఏంటి? అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. కానీ, ఇప్పటివరకు దీనిపై పంత్ మాత్రం స్పందించలేదు. ఏదేమైనా ప్రస్తుతం ఈ పోస్టులకు అభిమానుల నుంచి భారీగా స్పందన వస్తోంది.

ఇది ట్రైలర్ మాత్రమే- ఫైనల్​లో సినిమా చూపిస్తా: నీరజ్ చోప్రా - Paris Olympics 2024

మను బాకర్​కు గ్రాండ్​ వెల్​కమ్​ - డప్పు శబ్దాలకు చిందులేస్తూ హంగామా! - Manu Bhaker Grand Welcome

ABOUT THE AUTHOR

...view details