Paris Olympics 2024 Neeraj Chopra Silver : టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా ఈ సారి రజతంతో సరిపెట్టుకున్నాడు. అతడు ప్రస్తుత ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్‌లో రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. దీంతో మొత్తం 12 మంది పోటీ పడ్ ఈ ఫైనల్‌లో రెండో స్థానంలో నిలిచాడు. పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్‌కు కాంస్యం వచ్చింది.
గోల్డ్ మిస్ - జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు రజతం - Paris Olympics 2024 Neeraj Chopra - PARIS OLYMPICS 2024 NEERAJ CHOPRA
Paris Olympics 2024 Neeraj Chopra Silver : బల్లెం వీరుడు, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు.
Published : Aug 9, 2024, 2:09 AM IST
|Updated : Aug 9, 2024, 2:15 AM IST
ఈ తుదిపోరులో మొత్తం ఆరు ప్రయత్నాల్లో నీరజ్ కేవలం రెండో త్రోలో మాత్రమేసఫలమయ్యాడు. మిగతా అన్ని ప్రయత్నాల్లోనూ ఫౌల్ అయ్యాడు. అయినప్పటికీ వరుసగారెండు ఒలింపిక్స్ పోటీల్లో రెండు పతకాలు అందుకున్న వీరుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు.
పాక్ ప్లేయర్ అర్షద్ రెండు సార్లు 90 మీటర్ల కన్నా ఎక్కువగా ఈటెను విసిరాడు. కాగా, ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించింది. వీటిలో తొలి సిల్వర్ మెడల్ నీరజ్‌దే. మిగతా వాటిలో షూటింగ్‌లో మూడు, హకీలో ఒకటి వచ్చింది. ఇవన్నీ కాంస్య పతకాలు.