Hardik Pandya Ban:ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఐపీఎల్ అడ్వజైరీ కమిటీ షాక్ ఇచ్చింది. శుక్రవారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌పై వేటు వేసింది. అతడికి రూ.30 లక్షలు జరిమానా విధిస్తూ, ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధించింది. ఇదే సీజన్లో మూడోసారి ఈ తప్పిదం చేసిన కారణంగా నిషేధం విధించినట్లు కమిటీ పేర్కొంది.
'ఈ మ్యాచ్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లఘించినందుకు హార్దిక్‌పై రూ.30 లక్షలు ఫైన్ విధిస్తూ, ఒక మ్యాచ్ నిషేధిస్తున్నాం. అతడితోపాటు ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మతో కలిపి జట్టులోని ప్లేయర్లందరికీ రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం కోత ఏది తక్కువైతే అది జరిమానా వేస్తున్నాం' అని ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే ప్రస్తుత సీజన్లో ముంబయి జర్నీ ముగిసింది. లీద్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబయు కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో 2025 సీజన్లోనే ముంబయి బరిలోకి దిగుతుంది. ఇక వచ్చే సీజన్లో ముంబయి ఆడే తొలి మ్యాచ్‌కు హార్దిక్ దూరం కానున్నాడు. కాగా, ఈ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఇప్పటికే మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్నాడు.