ICC Champions Trophy 2025 : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వాహణ ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించినట్లు తెలుస్తోంది. భారత్ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఐసీసీకి పీసీబీ చెప్పిందట. అయితే ఇందుకుగాను శనివారం జరిగిన కౌన్సిల్ మీటింగ్‌లో ఐసీసీ ముందు పీసీబీ పలు షరతులు విధించినట్లు సమాచారం. ఆవేంటంటే?
అవి కూడా అంతే
భవిష్యత్‌లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ టోర్నమెంట్లను కూడా హైబ్రిడ్ మోడల్‌నే నిర్వహించాలని పీసీబీ కండీషన్ పెట్టిందట. వచ్చే 7ఏళ్లలో భారత్ టీ20 వరల్డ్‌కప్ (2026), ఛాంపియన్స్ ట్రోఫీ (2029), వన్డే వరల్డ్ కప్ (2031) టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ టోర్నీల్లో పాల్గొనడానికి పాకిస్థాన్ కూడా భారత్‌లో పర్యటించదట. పాక్ మ్యాచ్‌లను తటస్థ వేదికలుగా నిర్వహించాలని పీసీబీ షరతు విధించినట్లు సమాచారం.
అయితే 2024 టీ20, 2031 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలకు భారత్‌తోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక ఆతిథ్య హక్కులను పంచుకోనున్నాయి. ఈ లెక్కన ఈ టోర్నీల్లో పాకిస్థాన్ మ్యాచ్‌లు బంగ్లా లేదా శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్ చేసే ఛాన్స్ ఉంది. కానీ, 2029 ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం పూర్తిగా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరి ఇది ఎలా జరుగుతుందో చూడాలి.
ఫైనల్ మాత్రం అక్కడే
ఒకవేళ ఈ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరుకుంటేనే హైబ్రిడ్ మోడల్లో (తటస్థ వేదిక)నే టైటిల్ ఫైట్ జరుగుతుంది. లేదంటే ఫైనల్ మ్యాచ్ మాత్రం లాహోర్ స్టేడియంలోనే నిర్వహించాలని పీసీబీ పట్టుబట్టిందట.
షేర్ పెంచాల్సిందే!
ఇక తమ నిర్ణయంలో వెనక్కితగ్గి, హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తున్నందుకు ఐసీసీ వార్షికాదాయంలో పాకిస్థాన్ షేర్ పెంచాల్సిందిగా కోరినట్లు తెలిసింది. ఈ షరతులకు అంగీకరిస్తేనే తాము హైబ్రిడ్ మోడల్‌కు సిద్ధం అవుతామని ఐసీసీకి పీసీబీ చెప్పిందట.
🚨 BREAKING ON CHAMPIONS TROPHY 🚨
— Johns. (@CricCrazyJohns) November 30, 2024
PCB has accepted the Hybrid model but they have asked for an increase in the revenue from ICC & Hybrid model for the ICC events happening in India till 2031. [RevSportz] pic.twitter.com/LNGS7WBILt
కాగా, ఇన్నిరోజులు భారత్ మ్యాచ్‌లపై స్పష్టత రాకపోవడం వల్ల ఐసీసీ తుది షెడ్యూల్ ఖరారు చేయలేదు. తాజా మీటింగ్‌లో దీనిపై ఓ కొలిక్కి రావడం వల్ల త్వరలోనే అఫీషియల్‌గా షెడ్యూల్ రిలీజ్ కానుంది. టీమ్ఇండియా తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడే ఛాన్స్ ఉంది. కానీ, దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ 2025 ఫిబ్రవరి 19నుంచి మార్చి 09 వరకు జరగనుంది. చివరిసారిగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. అప్పుడు సర్ఫరాజ్ ఖాన్ నాయకత్వంలో పాకిస్థాన్ టైటిల్ దక్కించుకుంది.
'హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకుంటారా?- టోర్నీ నుంచి తప్పుకుంటారా?' - పాకిస్థాన్‌కు ICC అల్టిమేటం
హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ - పాక్ బోర్డు తాజా సమాధానమిదే