Pant On Bumrah Konstas Fight : సిడ్నీ టెస్టు తొలి రోజు టీమ్ఇండియా కెప్టెన్- ఆస్ట్రేలియా యంగ్ బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్ మధ్య జరిగిన వాగ్వాదం చర్చనీయాంశమైంది. మైదానంలోనే ఈ ఇద్దరూ మాటల యుద్ధానికి దిగారు. మధ్యలో ఫీల్డ్ అంపైర్ కలుగజేసుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఈ గొడవపై టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం దీనిపై మాట్లాడాడు.
ఆస్ట్రేలియా ఓపెనర్లు సమయం వృథా చేయాలన్న ఉద్దేశంతోనే కొన్‌స్టాన్ గొడవకు దిగాడని పంత్ అభిప్రాయపడ్డాడు. 'ఆసీస్ ఓపెనర్లు అతి తెలివి ప్రదర్శించారు. సమయం వృథా చేయాలని అనుకున్నారు. అందుకే బుమ్రాతో కొన్‌స్టాస్ గొడవకు దిగాడని భావిస్తున్నాను. అతడు ఏం అన్నాడో నాకు వినిపించలేదు. కానీ, మేం మరో ఓవర్ వేయకుండా సమయాన్ని వృథా చేయాలని వాళ్లు భావించినట్లు నాకు అనిపించింది' అని పంత్ అన్నాడు.
ఇదీ జరిగింది
సిడ్నీ టెస్టు తొలి రోజు ముగుస్తుందనగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. రెండో ఓవర్‌లో బుమ్రా బౌలింగ్ వేయబోతుండగా, స్టైకింగ్‌లో ఉన్న ఖవాజా ఆగాలంటూ సైగ చేశాడు. అప్పుడు కొన్‌స్టాస్ కలుగజేసుకుని ఆగమని బుమ్రాకి సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. బుమ్రాకి కొన్‌స్టాస్ తీరు నచ్చలేదు, 'నీ సమస్య ఏంటి' అని ప్రశ్నించాడు. ఇంతలో అంపైర్ కలగజేసుకొని ఇద్దరినీ దూరంగా పంపించి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
Khawaja is delaying to ensure this is the last over before stumps. Bumrah is gesturing to Khawaja and the umpire about it. He isn't even looking at Sam Konstas until the teenager gets involved. Konstas is actively looking for altercations on the field.pic.twitter.com/cbawKtWe7o
— Zucker Doctor (@DoctorLFC) January 3, 2025
ఎప్పటికీ అతడు మా కెప్టెనే
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడకపోవడంపై కూడా పంత్ మాట్లాడాడు. 'మ్యాచ్‌కు దూరంగా ఉండాలనేది రోహిత్ ఎమోషనల్‌గా తీసుకున్న నిర్ణయం. అతడు చాలా కాలంగా కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్‌ను మేం సారథిగానే చూస్తాం. అతడు గొప్ప లీడర్. అయితే కొన్ని నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు. వాటి విషయంలో మనం ఏమీ చేయలేం. అది మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం' అని తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (40 పరుగులు) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బొలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, కమిన్స్ 2, లియాన్ 1 వికెట్ దక్కించుకున్నారు. మరోవైపు ఆసీస్ 9-1తో కొనసాగుతోంది.
'కొన్‌స్టాస్‌ను ఓసారి భారత్‌కు తీసుకురండి, చూపిద్దాం మనమేంటో!'- మాజీ క్రికెటర్
అప్పుడు అదే రైట్, ఇప్పుడు ఇదే కరెక్ట్- వివాదస్పదంగా థర్డ్ అంపైర్ నిర్ణయాలు!