Home State Players In IPL : ప్రతి క్రికెటర్‌కి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఉంటుంది. మరి దేశానికి ఎంపిక అవ్వలంటే అంతకుముందు డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించాలి. సొంత రాష్ట్రం తరఫున టన్నుల కొద్దీ పరుగులు, పదుల కొద్దీ సెంచరీలు బాదితే తప్పా అంతర్జాతీయ అరంగేట్రం లభించదు. అయితే డొమెస్టిక్ క్రికెట్ షెడ్యూల్, రెడ్ బాల్ క్రికెట్ మీద ఫోకస్, ఎక్కువ మంది ఆటగాళ్లు ఉండటం వల్ల ఒకప్పుడు యంగ్ క్రికెటర్లకు అంత త్వరగా అవకాశాలు వచ్చేవి కావు.
కానీ, ఐపీఎల్ రాకతో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలా మంది యంగ్ క్రికెటర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో ప్రపంచం మొత్తానికి తమ ప్రతిభను చూపే ఛాన్స్ దొరుకుతోంది. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే అదృష్టం కలుగుతోంది. ఫ్రాంచైజీలు వర్ధమాన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంతోపాటు ప్రపంచస్థాయి అకాడమీల్లో ట్రైనింగ్ కూడా అందిస్తున్నాయి.
ఇవన్నీ బాగానే ఉన్నా, ఐపీఎల్‌లో ఆయా ఫ్రాంచైజీలు లోకల్ ప్లేయర్లను కొనకపోవడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సొంత రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనాలని అభిమానులు తరచూ కోరుతుంటారు. సొంత ప్లేయర్ వల్ల టీమ్‌తో అభిమానులకు రిలేషన్ బలపడుతుంది. కానీ, ఇదివరకు ఐపీఎల్‌లో ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపించ లేదు.
అయితే ఇటీవల ముగిసిన మెగా వేలంలో మాత్రం కొన్ని ఫ్రాంచైజీలు సొంత రాష్ట్రానికి చెందిన ప్లేయర్లపై ఫోకస్ చేశాయి. అభిమానులతో అనుబంధాన్ని మరింతగా పెంచుకోవాలనే లక్ష్యంతో సొంత రాష్ట్రాల నుంచి ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టాయి. దీంతో పలువురు యువ ఆటగాళ్లకు తమ హోం టీమ్ జెర్సీ వేసుకునే అవకాశం దక్కింది. ఈ లిస్ట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా కర్ణాటకకు చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇంకా ఏయే ఫ్రాంచైజీలో ఎంత మంది సొంత ప్లేయర్లు ఉన్నారంటే?
Manoj’s numbers in the Maharaja Trophy are too hot to handle! 🔥
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 30, 2024
Our local Karnataka lad is all set to spice things up this season, bringing the same fiery energy to the RCB camp! 🙌#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/Bcj0LI3mLR
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): అత్యధికంగా కర్ణాటకకు చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
- దిల్లీ క్యాపిటల్స్ (DC): ఈ ఫ్రాంచైజీ రెండో స్థానంలో ఉంది. దిల్లీకి చెందిన ఆరుగురు ఆటగాళ్లను క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది.
- ముంబయి ఇండియన్స్ (MI): మహారాష్ట్ర నుంచి ఐదుగురు ప్లేయర్లను కొనుగోలు చేసి మూడో స్థానంలో నిలిచింది.
- చెన్నై సూపర్ కింగ్స్ (CSK): భారీ ఫ్యాన్ బేస్ ఉన్న సీఎస్కే తమిళనాడుకు చెందిన నలుగురు ఆటగాళ్లను జట్టులో చేర్చుకుంది. లిస్టులో నాలుగో స్థానంలో ఉంది.
- సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): ఐపీఎల్‌లోనే అత్యధిక మంది సొంత అభిమానులు (హోం స్టేట్ ఫ్యాన్స్) ఉన్న ఫ్రాంచైజీ సన్‌రైజర్స్. ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ సొంత రాష్ట్రం నుంచి ఆరెంజ్ ఆర్మీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని సన్‌రైజర్స్ భావించిందేమో. మెగా వేలంలో తెలంగాణ, ఏపీకి చెందిన ముగ్గురు యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది.