ETV Bharat / offbeat

"జొన్న రొట్టెలు" ఇలా ప్రిపేర్​ చేయండి - విరగకుండా గంటలపాటు సూపర్​ సాఫ్ట్​! - HOW TO MAKE SOFT JOWAR ROTI

-జొన్న రొట్టెలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -ఇంట్లోనే ఇలా ప్రిపేర్​ చేస్తే ఎంతో మృదువుగా

How to Make Soft Jowar Roti
How to Make Soft Jowar Roti (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 10:28 AM IST

How to Make Soft Jowar Roti : ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా జొన్న రొట్టెలకు గిరాకీ పెరిగింది. సాయంత్రమైతే చాలు వీధుల్లో ఉండే తోపుడు బండ్ల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇంట్లో చేసుకోవడం రాక, చేసే ఓపిక లేక చాలా మంది బయటే కొనుగోలు చేస్తున్నారు. అయితే బయట లభించే జొన్నరొట్టెలలో బియ్యప్పిండి కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన జొన్న రొట్టెలు కావాలనుకునేవారు ఇంట్లోనే చేసుకోవడం మంచిది. మరి మాకు రాదు అంటారా? అలాంటి వారి కోసమే ఈ స్టోరీ. జొన్నరొట్టెను సాఫ్ట్​గా ఎలా చేయాలి? అందుకు ఏ టిప్స్​ పాటించాలి అనేది ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • జొన్నపిండి- 1 కప్పు
  • నీరు- ముప్పావు కప్పు
  • ఉప్పు- రుచికి సరిపడా

తయారు చేయు విధానం:

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టి అందులో నీరు పోసి మరిగించుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
  • నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్​ ఆఫ్​ చేసి కప్పు జొన్న పిండి వేసి కలుపుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిండిని ఏ కప్పు కొలతతో తీసుకున్నామో అదే కొలతతో నీళ్లను తీసుకోవాలి. ఒక చెంచా పిండి ఎక్కువ వేసుకున్నా ఏం కాదు.
  • నీళ్లలో వేసిన పిండిని గరిటెతో బాగా కలుపుకుని మూత పెట్టుకుని వదిలేయండి. ఇలా చేయడం వల్ల ఆ వేడికి పిండి మగ్గుతుంది.
  • పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఓ వెడల్పాటి ప్లేట్​లోకి తీసుకుని ముద్దగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి జిగటగా ఉంటే మరికొంచెం జొన్నపిండిని కలపాలి. అలాకాకుండా పిండి గట్టిగా ఉంటే చేతులు కొంచెం తడి చేసుకుని పిండిని కలపాలి. ఇలా వేడి మీద పిండిని కలుపుకోవడం వల్ల రొట్టెలు సాఫ్ట్‌గా వస్తాయి.
  • జొన్న పిండిలో జిగురు ఉండదు. కాబట్టి మీరు ఎంత సేపు పిండిని వత్తుకుంటే అంత జిగురు ఏర్పడుతుంది. కాబట్టి, పిండిని సుమారు 10 నిమిషాల పాటు వత్తుకోండి. ఇలా చేయడం వల్ల రొట్టెలు విరగకుండా మెత్తగా వస్తాయి.
  • ఇప్పుడు జొన్న పిండిని సమాన భాగాలుగా చేసుకోవాలి. చపాతీ పీట లేదా బటర్​ పేపర్​ మీద పొడి జొన్న పిండి చల్లాలి. ఆ పిండి మీద ఓ ఉండను పెట్టి మరికొంచెం పొడి పిండి చల్లి నిధానంగా రోల్​ చేసుకోవాలి. ఈ పిండిని చపాతీల లాగా గట్టిగా వత్తితే విరిగిపోతాయి. కాబట్టి స్లోగా చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు రొట్టెను వేసి అర నిమిషం పాటు వదిలేయండి. ఆ తర్వాత కొన్ని నీళ్లను చల్లి రొట్టెపై తడి చేయండి. మళ్లీ ఒక అర నిమిషం అయిన తర్వాత రొట్టెను ఫ్లిప్‌ చేసి నిదానంగా రెండు వైపులా కాల్చుకోవాలి.
  • జొన్న రొట్టెలు కాలడానికి కొంత టైమ్‌ పడుతుంది. త్వరగా కాల్చితే రంగు వస్తాయి కానీ, లోపల పిండి ఉడకదు. కాబట్టి, నెమ్మదిగా కాల్చుకోవాలి. ఈ రొట్టెలు సరిగ్గా కాలితే పొంగు వస్తాయి. అంతే వీటిని వేడివేడిగా హాట్‌ బాక్స్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
  • ఇలా చేస్తే ఎంత సేపైనా కూడా రొట్టెలు ఎంతో సాఫ్ట్‌గా ఉంటాయి. ఈ రొట్టెలు వేడివేడిగా ఏ కర్రీలో తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

కిచిడీ, పాయసం మాత్రమే కాదు - ఇలా "సగ్గుబియ్యం రొట్టెలు" చేసుకోండి! - టేస్ట్ అదుర్స్!

షుగర్​, బరువును అదుపులో ఉంచే "క్యారెట్ కొబ్బరి జొన్న రొట్టెలు" - సింపుల్​గా చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.