ETV Bharat / entertainment

బాలీవుడ్​లో పుష్పగాడి క్రేజ్ - పది గంటల్లో 55000 టికెట్స్​​ సోల్డ్​- సింగిల్ స్క్రీన్స్​ కథ వేరు! - PUSHPA 2 ADVANCE BOOKING IN HINDI

హిందీలో అడ్వాన్స్​ బుకింగ్స్​లో దూసుకెళ్తున్న పుష్ప-2 సినిమా

Pushpa 2 Advance Booking In Hindi
Pushpa 2 Advance Booking In Hindi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2024, 9:56 AM IST

Pushpa 2 Advance Booking In Hindi : బాలీవుడ్​ బాక్సాఫీస్​ను పుష్ప-2 షేక్​ చేస్తోంది!. హిందీలో 10 గంటల వ్యవధిలోనే 55,000 టికెట్లు అమ్ముడయ్యాయి. పీవీఆర్​ ఐనాక్స్​, సినీపోలిస్​ వంటి నేషనల్​ థియేటర్​ చైన్​లలో రిలీజ్​ రోజు ఈ టికెట్స్ అమ్ముడుపోయాయి. బాలీవుడ్​ చరిత్రలో ఇంత వేగంగా టికెట్లు అమ్ముడుపోయిన అతికొద్ది సినిమాల సరసన పుష్ప-2 చేరింది. అడ్వాన్స్​ బుకింగ్స్​లో పుష్ప-2, యానిమల్, గదర్​-2ను దాటేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
కాగా, అడ్వాన్స్​ బుకింగ్​ పరిస్థితి నాన్​ నేషనల్​ థియేటర్​ చైన్స్​, సింగిల్ స్క్రీన్​ థియేటర్లలో వేరే విధంగా ఉంది. టికెట్లు లైవ్​లోకి వెళ్లాక గంటల వ్యవధిలోనే హౌజ్​ఫుల్​ బోర్డులు పెడుతున్నాయి సింగిల్​ స్క్రీన్​ థియేటర్ల యాజమాన్యాలు.

అంతేకాకుండా, బుధవారం రాత్రి వరకు 5 లక్షల టికెట్లు సోల్డ్​ కావడమే లక్ష్యంగా పుష్ప-2 దూసుకెళ్తోంది. అలా 6 లక్షల మార్క్​ దాటితే ఏడేళ్ల బాహుబలి-2 రికార్డ్​ను పుష్పగాడు బద్దలుగొట్టడం ఖాయం. 2017లో దాదాపు 6.5 లక్షల బాహుబలి-2 మూవీ టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక, మూవీమ్యాక్స్​లో 12 గంటల్లో 4వేల టికెట్లు అమ్ముడుపోయాయి.

బెనిఫిట్​ షోలకు గ్రీన్ సిగ్నల్
ఇదిలా ఉండగా, 'పుష్ప 2' సినిమా టికెట్ ధరలు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రెండు బెనిఫిట్ షో లకు ప్రభుత్వం అనుమతించింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు తొలి బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంటలకు రెండో షో పడనుంది. అయితే ఈ బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ.800 పెంచుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ఇప్పుడున్న ధరకు అదననంగా రూ.800 చెల్లించాల్సిందే. అంటే బెనిఫిట్​ షోకు టికెట్‌ ధర సింగిల్ స్క్రీన్స్​లో సుమారు రూ. 1000, మల్టీప్లెక్స్​లలో రూ.1200 పైగా అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.