తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​తో టెస్టు టీమ్​లో షమీకి నో ప్లేస్- అదే కారణమా? - MOHAMMED SHAMI TEST SERIES

కివీస్​తో టెస్టు సిరీస్ కోసం సెలక్ట్​ చేసిన టీమ్​లో షమీకి నో ప్లేస్ - ఆ విషయం వల్లే!

Mohammed Shami Test Series
Mohammed Shami (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Oct 12, 2024, 1:29 PM IST

Mohammed Shami Test Series : న్యూజిలాండ్​తో స్వదేశంలో జరగనున్న మూడు టెస్టుల సిరీస్​కు భారత జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో 15 మందితో కూడిన టీమ్​ను ప్రకటించగా, బంగ్లాదేశ్​తో టెస్టు సిరీస్​లో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించారు. అయితే స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వస్తాడని భావించినా, అతడికి చోటు దక్కలేదు. అలాగే బంగ్లా సిరీస్​లో ఆడిన యశ్ దయాల్ పైన కూడా సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు, యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రాను వైస్ కెప్టెన్​ను చేశారు.

బుమ్రాకు వైస్ కెప్టెన్- అందుకోసమేనా?
కివీస్​తో అక్టోబర్ 16 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం పెద్దగా ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేకుండా బంగ్లాదేశ్​తో ఆడిన జట్టునే అనౌన్స్ చేశారు. అయితే ఆ సిరీస్​లో ప్రత్యేకంగా వైస్​కెప్టెన్ లేకపోగా, న్యూజిలాండ్ సిరీస్​కు ఆ బాధ్యతలను బుమ్రాకు అప్పగించారు. ఈ ఏడాది నవంబరులో మొదలయ్యే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని దృష్టిలో ఉంచుకునే బుమ్రాను వైస్‌ కెప్టెన్​గా ప్రకటించినట్లు సమాచారం. ఆ సిరీస్‌ తొలి మ్యాచ్​కు వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్‌ శర్మ దూరం కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ మ్యాచ్​కు నాయకత్వ బాధ్యతలు చేపట్టడం కోసం ముందే బుమ్రాను వైస్‌ కెప్టెన్​గా బీసీసీఐ నియమించినట్లు తెలుస్తోంది. కాగా, గతంలోనూ బుమ్రా కెప్టెన్​గా వ్యవహరించాడు. 2022లో బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టుకు బుమ్రా టీమ్ ఇండియాకు సారథ్యం వహించాడు.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగం
టీమ్​ఇండియా పేస్ విభాగం బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్​తో బలంగా ఉంది. అలాగే ట్రావెలింగ్ రిజర్వ్​లో యువ పేసర్ మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. అలాగే అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్​తో స్పిన్ విభాగం కూడా స్ట్రాంగ్​గా ఉంది. ఇక బ్యాటింగ్ విభాగానికొస్తే బంగ్లా సిరీస్​లోలానే రోహిత్, యశస్వీ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. శుభ్​మన్ గిల్ నంబరు 3లో రావొచ్చు.

అదే కారణమా?
ఆస్ట్రేలియా టూర్​కు ముందు స్వదేశంలో జరిగే న్యూజిలాండ్ సిరీస్​కు పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్​నెస్​తో జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. అయితే కివీస్​తో సిరీస్ కోసం షమీని ఎంపిక చేయకపోవడం చూస్తుంటే, అతడు పూర్తి ఫిట్ నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఆ లెక్కన షమీ ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఉంటాడా? లేదా అన్నది చూడాలి. కాగా, గతేడాది నవంబరులో జరిగిన వరల్డ్​ కఫ్ ఫైనల్ తర్వాత షమీ ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆటలేదు. చీలమండ గాయం కారణంగా సర్జరీ చేయించుకుని, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో విశ్రాంతి తీసుకుంటూ సాధన చేస్తున్నాడు.

భారత జట్టు :
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్, సర్ఫరాజ్‌ ఖాన్, రిషబ్‌ పంత్, ధ్రువ్‌ జురెల్, రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌ దీప్‌.

షెడ్యూల్
కాగా, అక్టోబరు 16 నుంచి భారత్- కివీస్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరులో అక్టోబర్ 16-20 వరకు తొలి టెస్టు, పుణె వేదికగా అక్టోబర్ 24-28 వరకు రెండో టెస్టు, ముంబయిలో నవంబర్ 1-5 వరకు మూడో టెస్టు జరగనుంది.

సంజూ శాంసన్ ఖాతాలోకి అరుదైన ఘనత - 9 ఏళ్ల కెరీర్​లో ఇదే తొలిసారి! - Sanju First Chance in 9 Years

భారత్‌లోని ఆ 3 మైదానాల్లో టెస్ట్ సెంచరీ చేయని కోహ్లీ - ఎక్కడంటే?

ABOUT THE AUTHOR

...view details