Kieron Pollard 900 Sixes : వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ మరో మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్ హిస్టరీలో 900 సిక్సర్లు బాదిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్ జట్టు తరఫున ఆడుతున్న పొలార్డ్, డెసెర్ట్ వైపర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 23 బంతులు ఎదుర్కొని 36 పరుగులు బాదాడు. అందులో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండటం విశేషం.
రెండో బ్యాటర్‌గా రికార్డు
ఈ మూడు సిక్సర్లతో కలుపుకొని టీ20 క్రికెట్లో పొలార్డ్ సిక్సర్ల సంఖ్య 900 దాటింది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 19వ ఓవర్లో లూకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టి 900వ సిక్సర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు పొలార్డ్. దీంతో 900సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. అయితే అంతకంటే ముందు విండీస్ మాజీ దిగ్గజం క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు
1. క్రిస్ గేల్ - 1056 సిక్సర్లు (455 ఇన్నింగ్స్ లు)
2. కీరన్ పొలార్డ్ - 901 సిక్సర్లు (614 ఇన్నింగ్ లు)