Mid Manair Reservoir in Sircilla District : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరంలోని మధ్య మానేరు జలాశయం బ్యాక్ వాటర్లో తెప్పల పోటీలు శుక్రవారం (జనవరి 17న) ఉత్సాహంగా జరిగాయి. పోటీలో ముంపు గ్రామాల మత్స్యకారులతో పాటు పరిసర గ్రామాల మత్స్యకారులు సైతం కేరింతలు కొడుతూ హుషారుగా పాల్గొన్నారు. ఈ తెప్పల పోటీలను ఆసక్తిగా తిలకించేందుకు అక్కడి స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కేరింతలు కొడుతూ పోటీల్లో పాల్గొన్న పోటీదారులను సంతోషంతో ప్రోత్సహించారు.
మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో : రుద్రవరం ముదిరాజ్ మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా సంక్రాంతి పండుగ సందర్భంగా తెప్పల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, మాజీ ఎమ్మెల్యే పాపారావు పాల్గొన్నారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి కృషి చేస్తుందని తెలిపారు. తెప్పల పోటీలో విజయం సాధించిన వారికి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.
"క్రీడాకారులను పోటీలో చూస్తుంటే ఎవరు ముందు వస్తారా? ఆతురతతో చూసాం. ఎస్పీ గారు సైతం ఆసక్తిగా చూశారు. ఈ తెప్పల పోటీలను నిర్వహించి, మా లాంటి వాళ్లను ఆహ్వానించడం మంచి పరిణామం. మిడ్ మానేరు డ్యాం సామర్థ్యం ఎంత ఉందో దానిక తగ్గట్టుగా చేపల పిల్లలను తీసుకురావడానికి, అలాగే కొత్త రకం చేపలపై కూడా దృష్టి పెడతాం. బొమ్మిడి చేపలను సబ్సీడీ కింద ఎవరూ ఇస్తలేరు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దకు తీసుకెళ్తా. దీనివల్ల సంపద పెరగడంతో పాటు, ఆ సంపద మత్స్యకారులకు అందుతుంది. ఈ చేపలను తిన్న వారికి కూడా మంచి పౌష్టిక ఆహారం లభిస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు" -ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
'మొట్టమొదటిసారి తెలంగాణలో తెప్పల పోటీలు'
Boat races in prakasam: సంక్రాంతి వేళ.. హోరాహోరీగా పడవల పోటీలు