Jasprit Bumrah Cricket Australia : ఆసీస్‌లో తాజాగా టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఏటా ప్రకటించే 'టీమ్ ఆఫ్ ది ఇయర్'కు కెప్టెన్‌గా ఈ సారి బుమ్రా పేరును ఎంపిక చేసింది. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో ఈ స్టార్ ప్లేయర్ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడ్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక భారత జట్టుకు చెందిన యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ కూడా ఈ జట్టులో ఉండటం విశేషం.
ఇక ఈ ఏడాది బుమ్రా మొత్తంగా 84 వికెట్లు తీసుకొన్నాడు. కానీ అతడి తర్వాత రెండో స్థానంలో ఉన్న హసరంగ కేవలం 64 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. అయితే ఈ ఇద్దరి మధ్య ఉన్న 22 వికెట్ల తేడా బుమ్రా సత్తాను తెలియజేస్తోంది.
ఇదిలా ఉండగా, 11 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీ సాధించడానికి ప్రధాన కారణం కూడా బుమ్రానే. టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన స్లాగ్ ఓవర్లను కట్టుదిట్టంగా వేసి మరీ వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా తాజాగా జరిగిన బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో కూడా తొలి మ్యాచ్‌లో జట్టుకు పెర్త్ వికెట్‌పై ఏకంగా 295 పరుగుల భారీ విజయాన్ని ఇచ్చాడు. ఇక సిరీస్ మొత్తంలో అతడు ఇప్పటి వరకు 30 వికెట్లను పడగొట్టాడు. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం కేవలం 20 వికెట్లనే పడగొట్టాడు.