Virat Kohli IND Vs AUS : ఇటీవలే మెల్‌బోర్న్‌లో ఆసీస్ అభిమానులు కోహ్లీని ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐదో టెస్ట్‌లోనూ ఇదే రకమైన ఘటన జరిగింది. అయితే ఇక్కడా కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ పలువురు ఆసీస్ అభిమానులు రెచ్చిపోయారు. కానీ ఈ సారి విరాట్ వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా అక్కడివారంతా షాకయ్యారు. ఇంతకీ ఏమైందంటే?
అసలేం జరిగిందంటే?
సిడ్నీ టెస్టుకు జస్‌ప్రీత్ బుమ్రా సారథ్య బాధ్యతలు అయితే గాయం కారణంగా అతడు రెండో రోజు చివరి సెషన్‌లో డగౌట్‌కు వెళ్లిపోయాడు. కానీ అంతకుముందు అతడి షూస్‌లో సాండ్ పేపర్ ఉందంటూ పలు వీడియోలను ఆసీస్ ఫ్యాన్స్ షేర్ చేసి ట్రోల్ చేశారు. దీనిపై ఐసీసీ విచారణ చేపట్టాలంటూ కామెంట్లు కూడా చేశారు. ఇవాళ బుమ్రా బౌలింగ్‌కు రాలేదు. దీంతో అతడికి బదులు విరాట్ జట్టును నడిపిస్తున్నాడు. కానీ ఆసీస్ అభిమానులు ఆ విషయం గురించి అక్కడు కూడా కామెంట్ చేయడం మొదలెట్టారు. దీంతో స్టీవ్ స్మిత్ ఔటైన వెంటనే విరాట్ కోహ్లీ తన జేబులో చేతులు పెట్టి 'నా దగ్గర ఏమీ లేదు. చూసుకోండి' అన్నట్లు సైగ చేసి చూపించాడు. దీంతో ట్రోల్ చేస్తూ అరిచిన ఆసీస్ అభిమానులంతా ఒక్కసారిగా షాకయ్యారు.
No sandpaper in sight here! 😶🤫#ViratKohli shares a light-hearted banter with the crowd, while #IrfanPathan perfectly sums up #TeamIndia's clean and fair game!#AUSvINDOnStar 👉 5th Test, Day 3 | LIVE NOW | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/7lhSO8nq2L
— Star Sports (@StarSportsIndia) January 5, 2025
స్మిత్ సాండ్ పేపర్ స్కాం వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. బుమ్రాపై వస్తున్న ట్రోల్స్‌కు కౌంటర్‌గా విరాట్ స్పందించటం భారత అభిమానులను ఆకట్టుకుంది. తమ జట్టు ఆటగాళ్లు ఆసీస్‌లా మోసం చేయరంటూ టీమ్‌ఇండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, సిడ్నీలో ఎంతో ఉత్కంఠగా జరిగిన చివరి టెస్ట్‌లో ఆసీస్ పైచేయి సాధించింది. భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో 3-1 తేడాతో ఐదు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా చేరుకోగా, ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది.
'ఇలా కూడా రనౌట్ అవుతారా?- గల్లీ క్రికెట్ అనుకున్నారా బాబు?'
33 బంతుల్లో ఫాస్టెస్ట్ 50 - తన రికార్డునే బ్రేక్ చేసిన పంత్!