తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూట్యూబ్​ ఛానెల్​ స్టార్ట్ చేసిన బుమ్రా - ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ - Jasprit Bumrah youtube channel - JASPRIT BUMRAH YOUTUBE CHANNEL

Jasprit Bumrah Lauches his own youtube channel : చాలా మంది క్రికెటర్‌లు కంటెంట్‌ క్రియేటర్‌లుగా మారి అభిమానులకు ఆసక్తికర కంటెంట్‌ అందిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో జస్ప్రీత్‌ బుమ్రా చేరాడు. పూర్తి వివరాలు స్టోరీలో

.
.

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 6:20 PM IST

Jasprit Bumrah Lauches his own youtube channel : ప్రస్తుతం సోషల్‌ మీడియా వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువగా యూజ్‌ చేస్తున్నారు. ఈ అప్లికేషన్‌ల ద్వారా అభిమానులకు టచ్‌లో ఉండేందుకు చాలా మంది సెలబ్రిటీలు ప్రయత్నిస్తున్నారు. సినిమా, టీవీ స్టార్‌లే కాదు క్రికెటర్‌లూ కంటెంట్‌ క్రియేటర్‌లుగా మారుతున్నారు. ఇప్పటికే చాలా మంది పాపులర్‌ ప్లేయర్‌లు యూట్యూబ్‌ ఛానెల్స్‌ స్టార్ట్‌ చేశారు. తాజాగా ఈ లిస్టులో టీమ్‌ ఇండియా, ముంబయి ఇండియన్స్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కూడా చేరాడు.

తాజాగా ఈ విషయాన్ని బుమ్రా ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసుకున్నాడు. శుక్రవారం బుమ్రా చేసిన ట్వీట్‌లో - ‘అందరికీ హలో, నేను నా సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ స్టార్ట్‌ చేశానని చెప్పడానికి వచ్చాను. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కంటెంట్‌ను అందించబోతున్నాను. నా జీవితంలోకి ఆసక్తికర అంశాలను మీతో పంచుకుంటాను. కాబట్టి కింది లింక్‌ను క్లిక్ చేసి, నా జర్నీలో నాతో చేరండి. మిమ్మల్ని అక్కడ కలుస్తా.’ అని పేర్కొన్నాడు. బుమ్రా యూట్యూబ్‌ ఛానెల్‌ లింక్‌ https://www.youtube.com/@JaspritBumrah1993 ద్వారా సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు.

  • కంటెంట్‌ క్రియేటర్లుగా క్రికెట్‌ స్టార్లు -తమ డైలీ లైఫ్‌, కెరీర్‌ అప్‌డేట్‌లు షేర్‌ చేసుకునేందుకు సెలబ్రిటీలు సోషల్‌ మీడియాను యూజ్‌ చేసుకుంటారు. అయితే కొంత మంది పాపులర్‌ క్రికెటర్‌లు ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకోవడం, ప్రత్యేక ఇంటర్వ్యూలు, షోలు చేయడంతో ఫ్యాన్స్‌కు బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందజేస్తున్నారు. ఇప్పటికే టీమ్‌ ఇండియా, రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌తో పాపులర్‌ అయ్యాడు.

    అలానే లెజెండరీ క్రికెటర్లు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ యూట్యూబ్ ఛానెల్ 'క్లబ్ ప్రైరీ ఫైర్'లో షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం ప్రారంభంలో రోహిత్ శర్మ, తాజాగా టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో నిర్వహించిన షోలు పాపులర్‌ అయ్యాయి.
  • ఆసక్తికర విషయాలు వెలుగులోకి -వివిధ టీవీ ఛానెళ్లు, పత్రికలు తరచూ క్రికెటర్లను ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటాయి. అయితే సహచరులు, సీనియర్లతో షోలో పాల్గొనడం, ఆసక్తిర విషయాలు షేర్‌ చేసుకోవడాన్ని ఫ్యాన్స్‌ ఆస్వాదిస్తున్నారు. చాలా కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. క్రికెట్‌ లోపాలు, విశ్లేషణలు, ప్రణాళికలపై ఓపెన్‌గా డిస్కస్‌ చేసుకుంటున్నారు. అశ్విన్‌, గిల్‌క్రిస్ట్‌ యూట్యూబ్‌ ఛానెల్స్‌ తరహాలోనే బుమ్రా ఇంట్రెస్టింగ్‌ కంటెంట్‌ అందించాలని, పాపులర్‌ అవ్వాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.


    యువీకి అరుదైన గౌరవం- T20 వరల్డ్​కప్​ అంబాసిడర్​గా ఎంపిక - 2024 T20 World Cup

ABOUT THE AUTHOR

...view details