IPL 2024 KL Rahul Sanjiv Goenka Argument :లఖ్‌నవూ సూపర్ జెయంట్స్ జట్టు క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. అయితే అది మ్యాచ్ రిజల్ట్ వల్ల కాదు. ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకాకు, జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మధ్య ఇటీవలే జరిగిన గొడవ వల్ల. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అందరూ దీన్ని తప్పు పడుతున్నారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు ఎల్ఎస్జీ అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూసెనర్.
"ఇద్దరు క్రికెట్ లవర్స్ మధ్య జరిగిన చర్చలో నాకెటువంటి సమస్య ఉన్నట్లుగా కనిపించలేదు. అదొక టీ కప్పులో తుఫాను వంటిది. ఇలాంటి డిస్కషన్లు జరుగుతుండాలి. అలా జరిగితేనే టీమ్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇదంత పెద్ద విషయమమేమీ కాదు" అని తాజాగా జరిగిన ఇంటర్ల్యూలో చెప్పుకొచ్చాడు.
"కేఎల్ రాహుల్ తనకున్న ప్రత్యేక స్టైల్‌తోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఈ ఐపీఎల్ మాత్రం అతనికి చాలా కష్టంగా మారింది. కెప్టెన్‌గానూ అటు జట్టు వికెట్లు కోల్పోతుండటం తలనొప్పిగా మారింది. బ్యాటింగ్ విభాగం లఖ్‌నవూ జట్టును క్లిష్ట పరిస్థితుల్లో పడేసింది. కీలకమైన సమయాల్లోనే వికెట్లు నిలబెట్టుకోలేకపోయింది" అని తెలిపాడు.
అసలేం జరిగిందంటే ? - రీసెంట్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు ధాటిగా ఆడి 9.4 ఓవర్లలోనే లఖ్‌నవూ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించేశారు. దీంతో తమ జట్టు కనబరిచిన ప్రదర్శనపై ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా విసుగెత్తిపోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో మీడియాతో పాటు స్టేడియంలో అభిమానులు చూస్తుండగానే తిట్టిపోశాడు. దీంతో సగం సగం ఇన్ఫర్మేషన్‌తో ఇంటర్నెట్‌లో వచ్చే ఏడాది రాహుల్‌ను లఖ్‌నవూ జట్టు అంటిపెట్టుకోదని, అదే డిస్కషన్ జరిగిందని ప్రచారం సాగింది.
Lucknow Super Giants Points Table : కాగా, ఐపీఎల్ 2024లో 12 లీగ్ మ్యాచ్‌లు ఆడిన లఖ్‌నవూ 6 మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆడినా ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. లఖ్‌నవూ తన తర్వాతి మ్యాచ్ లను మే14న దిల్లీ క్యాపిటల్స్‌తో, మే17న ముంబయి ఇండియన్స్‌తో ఆడనుంది.
'కెమెరాల మధ్య అలా చేయడమేంటి?- అది జరగాల్సింది నాలుగు గదుల లోపల' - KL Rahul Sanjiv Goenka
కేఎల్ రాహుల్‌పై విరుచుకుపడ్డ లఖ్‌నవూ యజమాని! - వైరల్ వీడియో చూశారా? - IPL 2024 LSG