Indiramma Illu Status Check Website : పేదలకు ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. సర్వే నిర్వహించి, లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రామాల్లో సభలు నిర్వహించి జాబితాలోని అర్హుల పేర్లు సైతం చదివారు. పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. వీరు ప్రస్తుతం తమ అప్లికేషన్ స్టేటస్ ఏ దశలో ఉంది? సర్వే చేశారా లేదా? ఇల్లు మంజూరు అయ్యిందా లేదా? ఏ లిస్ట్‌లో వచ్చింది? అనే వివరాలు తెలియక పంచాయతీ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక వెబ్‌సైట్ : ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రజలకు మరింత మేలు చేసేలా ఈ వివరాలు తెలుసుకునేందుకు వెబ్‌సైట్ క్రియేట్ చేసింది. ఈ వెబ్‌పేజీలో దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు, ఎలాంటి ఆటంకాలు ఉన్నా ఫిర్యాదుకు అవకాశం కల్పించింది. మరి ఆ వెబ్‌సైట్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
వెబ్సైట్లోకి వెళ్లాక :
ఆధార్ సంఖ్య నమోదు : సంబంధిత లింక్ https:///indirammaindlu.telangana.gov.in/applicantSearch ను ఓపెన్ చేసి ఆధార్ సంఖ్య నమోదు చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు స్థితి కనిపిస్తుంది. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అనంతరం పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిర్యాదుల కేటగిరీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఈ కింది ఐచ్ఛికాలు కనిపిస్తాయి.
- సర్వేయర్ సందర్శించలేదు
- సంతృప్తి చెందలేదు
- సర్వే సక్రమంగా జరగలేదు
- సర్వే సమయంలో గైర్హాజరయ్యారు
- ప్రజాపాలనలో దరఖాస్తు చేయలేదు
- మధ్యవర్తితో సమస్య
- డబ్బు డిమాండ్ చేస్తున్న సర్వేయర్
సమస్యను ఎంచుకొని ఫిర్యాదు : వీటిల్లో మీరు ఎదుర్కొన్న సమస్యను ఎంచుకొని ఫిర్యాదు వివరాలు రాయాలి. అనంతరం స్థలం లేదా ఇతర ధ్రువపత్రాలు (2 ఎంబీ పరిమాణం వరకు పీడీఎఫ్, పీఎన్‌జీ, జేపీజీ ఫార్మట్) అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఫిర్యాదు నంబర్ వస్తుంది. దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే కొద్దిరోజుల తర్వాత ఫిర్యాదు స్థితిని కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇళ్లు వచ్చిన వారు ఏ స్థితిలో (L1, L2, L3) ఇళ్లు వచ్చిందని చూసుకోవచ్చు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ - ఆ లిస్ట్‌లో ఉన్నవారికి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్స్!
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్