ETV Bharat / state

హైదరాబాద్​లో గ్రేప్ ఫెస్టివల్ - రేపటి నుంచి సందర్శకులకు అనుమతి - GRAPE FESTIVAL IN HYDERABAD

హైదరాబాద్​లో లాంఛనంగా ప్రారంభమైన గ్రేప్‌ ఫెస్టివల్‌ - రేపటి నుంచి సందర్శకులకు అనుమతి - ద్రాక్ష పంటకు పూర్వ వైభవం తీసుకురావడానికి అవగాహన

Grape Cultivation iN Sri Konda Laxman UNIVERSITY
Grape Festival In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2025, 9:51 AM IST

Grape Festival In Hyderabad : హైదరాబాద్​ రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోధన కేంద్ర క్షేత్రంలో గ్రేప్ ఫెస్టివల్ లాంఛనంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ ద్రాక్ష పండుగకు రేపటి నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. అంతరించిపోతున్న ద్రాక్ష పంటకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు వినియోగదారులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఏటా శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం గ్రేప్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.

ప్రారంభమైన గ్రేప్‌ ఫెస్టివల్‌ : ఈ ద్రాక్ష మేళాను శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ విపణిలో ద్రాక్ష పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో యూరప్, కెనడా, గల్ఫ్, రష్యా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు ఎగుమతులు చేయడానికి అవకాశాలున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా ప్యాకింగ్ హౌసులు, ప్రాసెసింగ్ యూనిట్లు, శీతల గిడ్డంగుల స్థాపన సహా ఇతర రూపాల్లో పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలని పలువురు రైతులు సూచించారు.

ద్రాక్ష సాగు అంతరించిపోతుంది : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ పంటకు తెలంగాణ పుట్టినిల్లుగా ప్రసిద్ధి. నగరీకరణ, స్తిరాస్థి వ్యాపారం, అభివృద్ధి నేపథ్యంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ద్రాక్ష సాగు అంతరించిపోతున్న వేళ మళ్లీ ఆ పంటకు పూర్వవైభవం తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేక అధిక శాతం రైతులు ద్రాక్ష పంట సాగు వదిలేయడంతో సాగు విస్తీర్ణం క్రమంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ద్రాక్ష పంట సాగు పట్ల రైతుల్లో సంపూర్ణ అవగాహన కల్పించేందుకు గ్రేప్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నట్లు గుత్తేదారు, శాస్త్రవేత్తలు తెలిపారు.

రైతులకు మంచి లాభాలు : రాష్ట్రానికి సొంతమైన ద్రాక్ష పంట మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయింది. ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ద్రాక్ష సాగు విదేశీ ఎగుమతుల ద్వారా రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌, మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల ధనిక కుటుంబాలను విస్తృతంగా ఆకర్షిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూరగాయలు, మామిడి వంటి పండ్ల మేళాలు నిర్వహిస్తామని శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి చెప్పారు. బుధవారం సందర్శకులను అనుమతించనున్న దృష్ట్యా రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధన కేంద్రంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

తాజా ద్రాక్షలు కావాలా నాయనా - అక్కడికి వెళ్తే ఫ్రీగా టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు

ఈ జ్యూస్​లు తాగితే 'వెయిట్​లాస్'​.. వడదెబ్బ నుంచి రక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.