Coins Problem in Kirana Store : ఇప్పుడు చాలాచోట్ల వ్యాపారులు ఆందోళన చెందుతూ కనిపిస్తున్నారు. కారణం సకాలంలో సరకులు రావడం లేదనో, ధరలు మండిపోతున్నాయనో, గిరాకీలు రావడం లేదనో కాదు. కావాల్సిన చిల్లర నాణేం అందుబాటులో ఉండటం లేదని. కాస్త ఆశ్యర్యంగా అనిపించినా వాస్తవానికి పరిస్థితి ఇలానే ఉంది. ఫలితంగా వినియోగదారులకు చిల్లర ఇవ్వలేక ప్రత్యమ్నాయ మార్గాలపై దృష్టి సార్తిస్తున్నారు. తాత్కాలికంగా సమస్య నుంచి ఉపశమనం పొందుతున్నారు.
గతంలో చాలా మంది పర్సులోనో, జేబులోనో చిల్లర డబ్బులు పెట్టుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. చిల్లరనూ ఎవరూ వెంట తీసుకెళ్లడం లేదు. దుకాణాల్లో వచ్చిన నాణేలను సైతం ఇంట్లో పిల్లలకు ఇవ్వడమో, గల్లాపెట్టెలో వేయడమో లాంటివి చేస్తున్నారు. దీంతో నాణేలు తిరిగి మార్కెట్‌కు చేరడం లేదు. ఈ ప్రభావం వ్యాపారులపై పడుతోంది. దేవాలయాల్లో హుండీ లెక్కింపు సమయంలోనూ చిల్లర నాణేల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు చెబుతున్నారు. బ్యాంకుల్లోనూ డిమాండ్‌కు సరిపడా నాణేలు అందుబాటులో ఉండవు. దీంతో వ్యాపారులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి చిల్లర సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకుంటున్నారు.
నాణేలకు బదులుగా సరుకులు : వస్తువులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారులకు రూ.1 లేదా రూ.2 వెనక్కి ఇవ్వాల్సి వస్తే నాణేలు ఉండడం లేదు. దీంతో బదులుగా చాక్లెట్లు ఇస్తున్నారు. నిత్యం గిరాకీ ఉండే చిన్న, పెద్ద తరహా కిరాణా దుకాణాలు, మార్ట్‌లు, ఇతర షాపింగ్ దుకాణాల్లో ఇది సమస్యగా మారింది. చిల్లరే కదా పోనీలే అని వదిలేసేవారు కొందరైతే, అవి మాత్రం డబ్బులు కావా, తిరిగివ్వాల్సిందేనని అడిగే వారు ఇంకొందరు. విషయమేదైనా వారికివ్వాల్సిన డబ్బులు వారికిచ్చేస్తే ఏ గొడవా ఉండదు. కానీ, రూ.10, రూ.20 నోట్లు కాదు. కొన్ని దుకాణాల్లో వాటి బదులుగా వినియోగాదారులకు మరో చిన్న సరకులను అందిస్తున్నారు. చాలా మంది వాటిని స్వీకరించకుండా ఎలాంటి గొడవలు లేకుండా తీసుకున్న వస్తువుల వాటిల్లోంచి కొన్ని తీసేస్తున్నారు.
నాణేలను తీసుకోవడానికి కమీషన్ : నాణేల కొరత ఉండటంతో అవి అందుబాటులో ఉన్నవారు కమీషన్‌పై వ్యాపారులకు ఇస్తున్నారు. రూ.100కి రూ.5 చొప్పున కమీషన్‌గా తీసుకుంటున్నారు. ఈ లెక్కన రూ.1000 విలువైన నాణేలు తీసుకున్నవారు రూ.50 చెల్లించాల్సిందే. ఆర్థికంగా కాస్త నష్టపరిచే విషయమే అయినా అవసరాలను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఇదే పద్ధతిలో చిల్లర నాణేలను తీసుకుంటున్నారు. ఇది కూడా అన్ని సమయాల్లో ఫలితమివ్వదు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అందుబాటులో లేకపోతే కష్టమవుతుందన్న కారణంతో వచ్చే వినియోగదారులనే విధిగా చిల్లర కూడా తీసుకొచ్చేలా ప్రోత్సహిస్తున్నామని, మెల్లమెల్లగా మార్పు కనిపిస్తోందని ఓ మార్ట్ నిర్వాహకుడు తెలిపారు.
డబుల్ టాస్ - డబ్బులు లాస్ - జీవితాలు నాశనం చేస్తున్న 'నాణేల ఆట'
దీపావళి వేడుకల్లో వెండి నాణేల పంపిణీ - చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి తండోపతండాలుగా భక్తులు
33 ఏళ్ల వ్యక్తి కడుపులో 33 కాయిన్స్- 3 గంటల పాటు డాక్టర్ల ఆపరేషన్!