తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూమెంట్​ ఆఫ్ ది మ్యాచ్​ - ఇది అస్సలు ఊహించలే! - kohli Gambhir - KOHLI GAMBHIR

IPL 2024 KKR VS RCB : ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన పోరులో మూమెంట్​ ఆఫ్ ది మ్యాచ్​ సందర్భం చోటు చేసుకుంది. గంభీర్ - కోహ్లీ తమ చర్యలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ వివరాలు.

మూమెంట్​ ఆఫ్ ది మ్యాచ్​ - ఇది అస్సలు ఊహించలే!
మూమెంట్​ ఆఫ్ ది మ్యాచ్​ - ఇది అస్సలు ఊహించలే!

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 6:27 AM IST

Updated : Mar 30, 2024, 7:33 AM IST

IPL 2024 KKR VS RCB : ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌ మధ్య వైరం ఉన్న సంగతి తెలిసిందే. గత సీజన్​లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా గంభీర్‌ వ్యవహరిస్తున్న సమయంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​ సందర్భంగా మైదానంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగిన చర్చనీయాంశమైంది.

Kohli Gambhir Hug : అయితే ఇప్పుడు కూడా కోల్‌కతా జట్టు మెంటార్‌గా గంభీర్‌ ఉంటున్నాడు. దీంతో ఆర్సీబీ - కోల్‌కతా మ్యాచ్‌ అనగానే అందరి దృష్టి గంభీర్ - కోహ్లీపైనే పడింది. మళ్లీ వీరిద్దరి మధ్య ఏదైనా వివాదం జరుగుతుందేమోనని చాలా మంది టెన్షన్ పడ్డారు. కానీ ఈ సారి అలా జరగలేదు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ బ్రేక్ టైమ్​లో ఈ ఇద్దరూ నవ్వుతూ పలకరించుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. గ్రౌండ్​లోకి వచ్చిన గంభీర్‌ విరాట్​ దగ్గరకు వెళ్లి మరీ కరచాలనం చేశాడు. కోహ్లీ కూడా నవ్వుతూ రియాక్ట్ అయ్యాడు. గంభీర్‌ను హగ్ చేసుకున్నాడు. ఇద్దరూ అలా కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. మూమెంట్​ ఆఫ్ ది మ్యాచ్​, మ్యాచ్‌లో ఇదే అత్యుత్తమ సందర్భం అంటూ కామెంట్లతో అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భానికి ఫెయిర్‌ ప్లే అవార్డు ఇవ్వాలంటూ కామెంటేటర్​ రవిశాస్త్రి కూడా అన్నాడు. మరోవైపు కేవలం ఫెయిర్‌ ప్లే అవార్డే కాదు వీళ్లకు ఆస్కార్‌ కూడా ఇవ్వాలని గావస్కర్‌ సరదాగా చమత్కరించాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే విరాట్‌ కోహ్లీ ఎంతో కష్టపడి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. కానీ అది విఫలమైపోయింది. తమ జట్టు పేలవ బౌలింగ్‌ వల్ల బెంగళూరు జట్టు ఘోర పరాజయాన్ని అందుకుంది. సన్​రైజర్స్​పై విజృంభించిన రసెల్‌ బరిలోకి దిగాల్సిన అవసరం లేకుండానే ఆర్సీబీపై బ్యాటింగ్​ను పూర్తి చేశారు మిగతా కోల్‌కతా బ్యాటర్లు. మరీ ముఖ్యంగా బౌలర్ సునీల్‌ నరైన్‌ బెంగళూరు బౌలర్లను ఆటాడుకున్న తీరు అదిరిపోయింది.

గంభీర్‌ Vs కోహ్లీ - దినేశ్‌ కార్తిక్‌ అలా అనేశాడేంటి? - Dinesh Karthik RCB

కోహ్లీ ఇన్నింగ్స్ వృథా- బెంగళూర్​పై కోల్​కతా విక్టరీ - RCB VS KKR IPL 2024

Last Updated : Mar 30, 2024, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details