తెలంగాణ

telangana

ETV Bharat / sports

పోరాడి ఓడిన ముంబయి - దిల్లీ ఖాతాలో ఐదో విజయం - IPL 2024 DC VS MI - IPL 2024 DC VS MI

IPL 2024 Delhi Capitals VS Mumbai Indians : తాజాగా జరిగిన మ్యాచ్​లో ముంబయి పోరాడి ఓడింది. దిల్లీ క్యాపిటల్స్ పది పరుగుల తేడాతో గెలిచింది.

/
/

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 7:45 PM IST

Updated : Apr 27, 2024, 7:59 PM IST

IPL 2024 Delhi Capitals VS Mumbai Indians :ఐపీఎల్‌ 2024లో దిల్లీ క్యాపిటల్స్‌ జోరు మీద కనిపిస్తోంది. వరుసగా రెండు విజయాలతో పాయింట్స్‌ టేబుల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి చేరింది. తాజాగా ఏప్రిల్‌ 27న దిల్లీ అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ విజయం సాధించింది. పది పరుగుల తేడాతో ఎంఐపై థ్రిల్లింగ్‌ విక్టరీ అందుకుంది. చివరి వరకు పోరాడిన ముంబయి ఇండియన్స్‌ వరుసగా వికెట్లు కోల్పోవడంతో టార్గెట్‌ను అందుకోలేకపోయింది. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (27 బంతుల్లో 87) సంచలన బ్యాటింగ్‌తో దిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబయి యంగ్‌ ప్లేయర్‌ తిలక్‌ వర్మ (32 బంతుల్లో 63) పోరాటం వృథా అయింది. కాగా, మొదట టాస్‌ గెలిచిన ముంబయి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దిల్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 257-4 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కి దిగిన ముంబయి 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులకే పరిమితం అయింది.

  • పోరాడి ఓడిన ముంబయి
    258 భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన ముంబయికు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. రోహిత్‌ శర్మ 8 బంతుల్లో 8 పరుగులు చేసి వెనుదిరిగాడు. జోరు మీద కనిపించిన ఇషాన్‌ కిషన్‌ సైతం 14 బంతుల్లో 20 రన్స్‌కు అవుట్‌ అయ్యాడు. సూర్య కుమార్‌ యాదవ్‌ కొంత సేపు మెరుపులు మెరిపించి పెవిలియన్‌ చేరాడు. సూర్య 13 బంతుల్లోనే 26 రన్స్‌ చేశాడు. హార్దిక్‌ పాండ్యా, తిలక్‌ వర్మ పార్ట్‌నర్‌షిప్‌ ముంబయిలో ఆశలు పెంచింది. ఇద్దరూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పాండ్యా 24 బంతుల్లో 46 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు.

అనంతరం టిమ్‌ డేవిడ్‌ హిట్టింగ్‌ మొదలైంది. భారీ సిక్సులతో విరుచుకుపడిన డేవిట్‌ దిల్లీని కాసేపు భయపెట్టాడు. అనూహ్యంగా ముకేష్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. డేవిడ్‌ 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు. చివరి నాలుగు ఓవర్లలో ముంబయికి 70 పరుగులు అవసరం అయ్యాయి. చివరి వరకు పోరాడిన తిలక్‌ వర్మ(32 బంతుల్లో 63) శ్రమ ఫలించలేదు. చివరి ఓవర్‌లో ముంబయి విజయానికి 25 పరుగులు అవసరం అయ్యాయి. తిలక్‌ వర్మ మొదటి బంతికే అవుట్‌ అవ్వడంతో ముంబయి కష్టాల్లో పడింది. చావ్లా, వుడ్‌ బౌండరీలు బాదినా పది పరుగుల దూరంలోనే ఎంఐ నిలిచిపోయింది.

దిల్లీ బౌలర్స్‌లో రషిక్‌ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ముకేష్‌ కుమార్‌ 4 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఖలీల్‌ అహ్మద్‌ 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

/
  • దిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోరు
    మొదటి బ్యాటింగ్‌ చేసిన దిల్లీకి జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్‌ పోరెల్ ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ భారీ స్కోరు అందించింది. జేక్‌ మొదటి బాల్‌ నుంచే ముంబయి బౌలర్‌లపై విరుచుకుపడ్డాడు. వుడ్ వేసిన మొదటి ఓవర్‌లో ఏకంగా 19 పరుగులు బాదాడు. వరుసగా 4, 4, 6, 0, 4, 1 కొట్టాడు. అభిషేక్‌ పోరెల్‌ నెమ్మదించినా జేక్‌ ఏ దశలోనే వెనక్కి తగ్గలేదు. బౌలర్‌ ఎవరైనా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. జేక్‌ విధ్వంసంతో దిల్లీ పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి 92-0 పరుగులు చేసింది.

జేక్‌ ఊచకోతకు చావ్లా వేసిన ఎనిమిదో ఓవర్‌లో బ్రేక్‌ పడింది. భారీ షాట్‌కి ప్రయత్నించిన జేక్‌ ఫీల్డర్‌కి చిక్కాడు. 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 11 ఫోర్లు, 6 సిక్సులు ఉండటం గమనార్హం. అభిషేక్‌ పోరెల్‌ (27 బంతుల్లో 36)ని నబీ అవుట్‌ చేశాడు. అనంతరం హోప్‌ 17 బంతుల్లో 41, పంత్‌ 19 బంతుల్లో 29 కొట్టారు. డెత్‌ ఓవర్‌లలో స్టబ్స్‌ 25 బంతుల్లో 48 పరుగులతో విరుచుకుపడటంతో దిల్లీ భారీ స్కోరు అందుకుంది. కేవలం 4 వికెట్లు కోల్పోయి 257 పరుగులు సాధించింది.

ముంబయి బౌలర్‌లు దిల్లీ బ్యాటర్లను నిలువరించలేకపోయారు. బుమ్రా 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ తీశాడు. చావ్లా 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. వుడ్‌, నబీ తలా ఒక్కో వికెట్‌ తీసినా ఓవర్‌కి పదికి పైగా పరుగులు ఇచ్చారు. వుడ్‌, తుషారా, పాండ్యా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పాండ్యా 2 ఓవర్లలో 41 పరుగులు ఇవ్వడం గమనార్హం.

జేక్​ ఫ్రేజర్ ఊచకోత - 310కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ముంబయిపై విరుచుకుపడుతూ! - IPL 2024 DV VS MI

టీ20ల్లో అత్యధిక ఛేజింగ్​లు ఇవే - టాప్​లో ఎవరున్నారంటే? - HIGHEST RUN CHASES

Last Updated : Apr 27, 2024, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details