Nayanthara Toxic Movie : రాకింగ్ స్టార్ యశ్ లీడ్ రోల్లో మలయాళ స్టార్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ 'టాక్సిక్'. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టులో కోలీవుడ్ స్టార్ నటి నయనతార నటించనున్నట్లు కన్ఫార్మ్ అయ్యింది. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"ప్రస్తుతం నేను యశ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. ఇందులో నయనతార కూడా తాజాగా భాగమయ్యారు. ఇంతకు మించి ఈ సినిమా గురించి వివరాలను నేను ఇప్పుడే రివీల్ చేయకూడదు. త్వరలోనే డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఓ అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే" అని అక్షయ్ పేర్కొన్నారు. అయితే ఈ చిత్రంలో నయన్ ఏ పాత్రలో కనిపించనున్నారనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా, గతంలో ఈ సినిమాలో ఎంతో మంది టాప్ స్టార్స్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బీటౌన్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేయనున్నట్లు పలు వార్తలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. కానీ వాటిపై గతంలో టీమ్ స్పందించింది. అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలని ప్రేక్షకులను కోరింది.
మరోవైపు 'టాక్సిక్' మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి యశ్ రోల్ గురించి తప్ప మిగతా వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. కానీ నటుడు అక్షయ్ ఒబెరాయ్ మాత్రం ఇందులో భాగమైనట్లు ఇటీవల ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇక టాక్సిస్ విషయానికి వస్తే యశ్ 19వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు ఈ యాక్షన్ మూవీతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు."ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్" అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. యశ్ బర్త్‌డే సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అది నెట్టింట వైరలై యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌ను తెచ్చిపెట్టింది. యశ్ లుక్స్ అండ్ మేక్ఓవర్కు కూడా ఫ్యాన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి.
ఇంటర్నేషనల్ లెవెల్లో 'టాక్సిక్' రిలీజ్ - డిసెంబర్ కల్లా థియేటర్లలోకి!
చిక్కుల్లో పడ్డ యశ్ మూవీ - 'టాక్సిక్' టీమ్‌కు షోకాజ్ నోటీసులు - ఎందుకంటే?