ETV Bharat / politics

సీఎం విదేశీ పర్యటన ముగిసే - 50 వేల కొలువులు మోసుకొచ్చే! - CM REVANTH REDDY RETURNED TO HYD

సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్, దావోస్ పర్యటన విజయవంతం - విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి బృందం - రూ.1,78,950 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి

CM Revanth Reddy Returned to Hyderabad
CM Revanth Reddy Returned to Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 12:38 PM IST

CM Revanth Reddy Returned to Hyderabad : తెలంగాణ రైజింగ్ బృందం విదేశీ పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సింగపూర్, దావోస్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుంది. దుబాయ్‌ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సింగపూర్‌, దావోస్‌ పర్యటన విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు, కార్యకర్తలు రేవంత్ రెడ్డిని కొనియాడారు.

దావోస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ - శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం (ETV Bharat)

సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు : విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం నగేందర్‌, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. దావోస్‌లో మొత్తం రూ.1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా, ఈసారి దానికి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50 వేల ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

అమెజాన్ కంపెనీతో రూ.60,000 కోట్ల భారీ ఒప్పందం : మొదట సింగపూర్​లో మరో రూ.3 వేల 950 కోట్ల ఒప్పందాలు జరిగాయి. దావోస్‌లో అమెజాన్ కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందం ఈ మొత్తం పర్యటనలోనే ముఖ్యమైంది. అమెజాన్‌ వంటి పెద్ద సంస్థ హైదరాబాద్​లొ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం శుభపరిణామంగా కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు.

తెలంగాణలో భారీ పెట్టుబడులు - రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ ఎంవోయూ

దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌ ప్రారంభించిన సీఎం రేవంత్ బృందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.