IRCTC Koffee With Karnataka Tour: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో కూర్గ్ ఒకటి. కూర్గ్ అందాలతోపాటు ఇతర ప్రకృతి అందాలు, పలు దేవాలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి, ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐఆర్సీటీసీ టూరిజం "కాఫీ విత్ కర్ణాటక(Koffee with Karnataka)" పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రైలు ప్రయాణం ద్వారా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో కూర్గ్, మైసూర్‌లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. టూర్ ప్రకటించిన తేదీల్లో ప్రతి బుధవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే.
- మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి కాచిగూడ-మైసూర్ ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నెం - 12785)లో జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 10 గంటలకు మైసూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి కూర్గ్ బయలుదేరుతారు. మధ్యాహ్నానికి కూర్గ్ చేరుకుని హోటల్లో చెకిన్ అవుతారు. ఆ తర్వాత Abbey ఫాల్స్ విజిట్ చేస్తారు. అలాగే ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించుకుని తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. ఆ రాత్రికి కూర్గ్‌లోనే బస చేస్తారు.
- మూడో రోజు హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తలా కావేరి(Talacauvery)కి వెళ్తారు. అక్కడ కావేరి బర్త్ ప్యాలెస్, బాఘమండల ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజా సీట్‌ను విజిట్ చేస్తారు. ఆ రాత్రికీ కూర్గ్‌లోనే ఉంటారు.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ అయ్యి మైసూర్ బయలుదేరుతారు. మార్గమధ్యలో టిబెటన్ మొనాస్టరీ, నిసర్ఘధామా విజిట్ చేస్తారు. ఆ తర్వాత మైసూర్ చేరుకుని హోటల్లో చెకిన్ అయ్యి బృందావన్ గార్డెన్స్ సందర్శిస్తారు. రాత్రికి మైసూర్‌లో వసతి ఉంటుంది.
- ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ విజిట్ చేస్తారు. మధ్యాహ్నం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. మూడు గంటలకు మైసూర్ నుంచి హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ(ట్రైన్ నెం 12786) ఉంటుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- ఆరో రోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ కంప్లీట్ అవుతుంది.
ధర వివరాలు చూస్తే:
1 నుంచి 3 ప్రయాణికులకు:
కంఫర్ట్(3AC):
- సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.33,160, డబుల్ ఆక్యూపెన్సీకి రూ.18,730, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.14,690గా నిర్ణయించారు.
- 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.11,140, విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,530గా నిర్ణయించారు.
స్టాండర్డ్(SL):
- సింగిల్ షేరింగ్‌కు రూ.31,140, ట్విన్ షేరింగ్‌కు రూ.16,710, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,670 చెల్లించాలి.
- 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.9,120, విత్ అవుట్ బెడ్ అయితే రూ.7,510గా నిర్ణయించారు. గ్రూప్ బుకింగ్ పై కొంత మేర తగ్గుతుంది.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- ట్రైన్ టికెట్లు
- పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీని బట్టి బస్సు
- 3 రాత్రులు హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్
- లంచ్, డిన్నర్ ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి.
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- ప్రస్తుతం ఈ టూర్ జనవరి 29వ తేదీన మొదలవుతుంది.
- పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.
ఇండియా గేట్, తాజ్‌మహల్ సహా ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు - తక్కువ ధరకే IRCTC దిల్లీ టూర్!
IRCTC "టెంపుల్ రన్" - కేరళ, తమిళనాడులో 7 రోజులపాటు దివ్యదర్శనాలు!