Rohit Sharma Wicket Celebration : గత సిరీస్‌ల నుంచి పేలవ ఫామ్‌లో ఇబ్బందిపడుతున్న టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడైనా తన సత్తా చాటి మునుపటి జోరు అందుకోవాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి తరఫున బరిలోకి దిగాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లోనే 3 పరుగులకు పెవిలియన్ వెనుదిరిగి నిరాశపర్చాడు. జమ్మూ కశ్మీర్ జట్టుకు చెందిన 31 ఏళ్ల పేసర్ ఉమర్ నజీర్ మిర్ రోహిత్ సహా ఆ జట్టు టాప్ బ్యాటర్లను హడలెత్తించాడు.
తన స్పెల్‌లో కీలకమైన రోహిత్‌ను ఔట్ చేయడంతో పాటు ముంబయి టీమ్ క్రికెటర్ అజింక్య రహానె (12), శివమ్ దూబె (0), హార్దిక్ టామోర్ (7)లను ఔట్ చేసి పంపి వార్తల్లో నిలిచాడు. ఓ షార్ట్ పిచ్ బంతితో రోహిత్‌ను ఊరించి మరీ ఆ వికెట్ సాధించాడు. ఈ క్రమంలో రోహిత్ ఔటైన తర్వాత అతడు పెద్దగా సంబరాలు చేసుకోలేదు. దానికి గల కారణాన్ని నజీర్ మొదటి రోజు ఆట పూర్తయ్యాక మీడియాతో వెల్లడించాడు. రోహిత్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని, తన పట్ల ఎంతో గౌరవంగా ఉండాలని అనుకుంటున్నాని నజీర్ తెలిపాడు. అందుకే తన వికెట్‌ను సెలబ్రేట్ చేసుకోలేదని పేర్కొన్నాడు.
"నా మనసులో ఉన్న మొదటి ఆలోచన ఏంటంటే నేను రోహిత్‌కి వీరాభిమానిని. అందుకే నేను అతని వికెట్ తీసిన తర్వాత నేను సంబరాలు చేసుకోలేదు. ఈ మ్యాచ్‌లో మేం గెలిస్తే అది ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రత్యర్థి జట్టులో టీమఇండియా కెప్టెన్ ఆడుతున్నాడు. మ్యాచ్‌కు ముందు ఎంతో రిలాక్స్‌గా ఉన్నాను. మంచి బంతి వేస్తే ఎలాంటి బ్యాటరైనా సరే కచ్చితంగా ఇబ్బందిపడతాడు. క్రీజులో ఉన్నది ఎంత పెద్ద ప్లేయర్ అనే విషయాన్ని పట్టించుకోకూడదు. కానీ, రోహిత్ శర్మ వికెట్ మాకు ఎంతో కీలకమైనది. అతడిని ఔట్ చేసినందుకు నేను సంతోషంగా ఉన్నా" అని నజీర్ క్లారిటీ ఇచ్చాడు.
రోహిత్ శర్మ, అజిత్ చాట్ లీక్! - మైక్ ఆన్‌లో ఉందని తెలియక ఆ మాట అనేశాడుగా!
రంజీలో స్టార్ క్రికెటర్లు ఫెయిల్! - సింగిల్ డిజిట్‌కే రోహిత్, గిల్, జైస్వాల్ ఔట్