Fire Accident at Mahindra Car Showroom : హైదరాబాద్ కొండాపూర్‌లోని మహీంద్ర కార్ షోరూంలో గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షోరూం మూసి వెళ్లే సమయంలో లోపలి నుంచి దట్టమైన పొగలు వస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి 8 ఫైరింజన్‌లతో పోలీసులు చేరుకున్నారు. దాదాపు 2.30 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో షోరూంలోని రెండు అంతస్తుల్లో ఉన్న కార్లలో దాదాపు 14 కార్ల వరకు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. పక్కనే ఉన్న సహర్ష్ గ్రాండ్ ఓయో హోటల్‌కు మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో హోటల్‌లోని వారందరినీ పోలీసులు ఖాళీ చేయించారు. కొండాపూర్, కొత్తగూడ ప్రధాన రహదారి కావడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్ని ప్రమాదానికి షాట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
షాపింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం - 500 మూగజీవాలు బలి!
ప్రైవేట్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం- చిన్నారి సహా ఏడుగురు మృతి