ETV Bharat / lifestyle

తలస్నానం చేయగానే జుట్టు దువ్వుతున్నారా? హెల్దీ హెయిర్​ కోసం ఈ టిప్స్ పాటించాలట! - HAIR FALL CONTROL TIPS

-తల స్నానానికి ఎలాంటి నీరు వాడితే మంచింది? -జుట్టు ఆరోగ్యానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలివే!

Hair Fall Control Tips
Hair Fall Control Tips (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Jan 24, 2025, 10:20 AM IST

Hair Fall Control Tips: ఈ మధ్య కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు ఊడిపోతుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నా.. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జుట్టు ఊడిపోకుండా కొంతవరకు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జుట్టు ఆరోగ్యానికి పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంత అవసరమో.. శిరోజాల సంరక్షణకు కూడా హెల్దీ లైఫ్ స్టైల్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల శరీరంలో నీటి స్థాయులు పెరగడమే కాకుండా చర్మంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయని వివరిస్తున్నారు. ఫలితంగా జుట్టు కూడా ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. 2015లో Journal of Cosmetic Dermatology ప్రచురితమైన The effects of hydration on hair growth అనే అధ్యయనంలోనూ తేలింది. ఇంకా అవసరమైతే వైద్యులను సంప్రదించి విటమిన్‌ సప్లిమెంట్స్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇందులోని పోషకాలు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయని తెలిపారు.

తలస్నానానికి బాగా వేడిగా ఉండే నీళ్లు ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్లకు నష్టం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి గోరువెచ్చని నీటినే తలస్నానానికి ఉపయోగించాలని సూచిస్తున్నారు. వెంట్రుకలు దృఢత్వాన్ని సంతరించుకోవాలంటే స్నానం తర్వాత కండిషనర్‌ను తప్పనిసరి రాసుకోవాలని సలహా ఇస్తున్నారు.

స్నానం చేసిన తర్వాత సాధ్యమైనంతవరకు జుట్టును సహజంగానే ఆరనివ్వాలని నిపుణలు అంటున్నారు. వేడి కలిగించే హెయిర్‌ డ్రయర్స్‌ను అధికంగా వాడడం వల్ల కుదుళ్లలో దురద, అలర్జీలు, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​ ప్రకారం అతి వేడి జుట్టును బలహీనంగా మారుస్తుందని తెలిపారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే తలస్నానం చేశాక జుట్టును తుడుచుకునేందుకు రెగ్యులర్ టవల్స్ బదులు మైక్రోఫైబర్‌ ర్యాపర్స్‌ను వినియోగిస్తే మేలని చెబుతున్నారు.

ముఖ్యంగా తలస్నానం చేసిన వెంటనే జుట్టును దువ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే వెంట్రుకలు తెగిపోవడం, ఎక్కువ జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. జుట్టు దువ్వుకోవడానికి కూడా మెత్తటి బ్రిజిల్స్ ఉండే దువ్వెనను ఉపయోగించడం ఉత్తమమని సూచిస్తున్నారు.

ఇంకా చల్లటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఉన్నితో తయారుచేసిన టోపీలతో జుట్టును కవర్ చేయాలని.. లేకపోతే చల్లటి గాలులు కురులకు నష్టం కలిగిస్తాయని వివరిస్తున్నారు. ఇంకా జుట్టు బాగా ఆరోగ్యంగా పెరగాలంటే క్రమం తప్పకుండా హెయిర్‌ను ట్రిమ్‌ చేసుకోవాలని చెబుతున్నారు.

కేశ సౌందర్య సమస్యలను దూరం చేసుకుని ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవాలంటే మసాజ్‌కు మించిన సాధనం లేదని నిపుణులు అంటున్నారు. కాబట్టి కనీసం వారానికి ఒకసారైనా హెయిర్‌ మసాజ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ కార్ అద్దంపై మరకలా? ఇంట్లోని గ్లాసులు మురికిగా మారాయా? ఈ టిప్స్ పాటిస్తే క్లీన్ అవుతుందట!

లవ్​లో ఉంటే ఎలా హగ్ చేసుకుంటారు? కౌగిలింతల వెనుక రీజన్స్ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.