Burnt Pressure Cooker Cleaning Tips: నేటి బిజీబిజీ రోజుల్లో ఏ పనైనా నిమిషాల్లో పూర్తవ్వాలని చాలా మంది కోరుకుంటారు. ఈ క్రమంలోనే మెజార్టీ జనం వంట తొందరగా పూర్తి కావాలని ప్రెషర్ కుక్కర్ ఉపయోగిస్తున్నారు. పప్పు, కూరగాయలు, నాన్‌వెజ్, పులావ్, బిర్యానీ, ఇలా వంటకాలు ఏవైనా సరే ప్రెషర్ కుక్కర్లో వండితే ఇట్టే ఉడికిపోతాయి. అందుకే ఎక్కువ మంది మహిళలు ఇందులోనే వంట చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఇంతవరకు బానే ఉన్నా, ప్రెషర్ కుక్కర్లో వంట చేసే క్రమంలో ఎక్కువ సేపు ఉడికించడం, నీళ్లు సరిపడా పోయకపోవడం వంటి కారణాల వల్ల కుక్కర్ మాడుతుంటుంది. దీంతో ఆ మరకలను క్లీన్ చేయాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. అలాంటి సమయంలో ఈ టిప్స్ పాటిస్తే కేవలం నిమిషాల్లోనే కుక్కర్‌ను కొత్తదానిలా మెరిపించవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
వెనిగర్, బేకింగ్ సోడా:
- ముందుగా మాడిన కుక్కర్ గిన్నె తీసుకోవాలి. అందులో ఎంత వరకు మాడిందో అక్కడి వరకు నీళ్లు పోసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్లు వెనిగర్ వేసి కలపాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నీటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిస్తున్నప్పుడు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
- నీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
- చల్లారిన తర్వాత ఆ నీటిని పారబోసి స్క్రబ్బర్ సాయంతో రుద్దితే మాడిన మరకలు పోయి కుక్కర్ ఈజీగా శుభ్రపడతుంది.
డిటర్జెంట్ పౌడర్:
- ముందుగా మాడిన కుక్కర్ గిన్నె తీసుకోవాలి. అందులో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ వేయాలి.
- ఆ తర్వాత ఓ రెండు గ్లాసుల నీళ్లు పోసి ఓ పావు గంట నాననివ్వాలి.
- ఆ తర్వాత కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు బాయిల్ చేయాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్‌లో మరో 10 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా మరిగిస్తున్నప్పుడు మధ్యమధ్యలో కలుపుతుండాలి.
- ఓ 5 నిమిషాల తర్వాత నీళ్లు పారబోసి స్క్రబ్బర్ సాయంతో క్లీన్ చేస్తే మాడిన మరకలు పోయి కుక్కర్ క్లీన్ అవుతుంది.
బేకింగ్ సోడా, నిమ్మకాయ:
- ముందుగా మాడిన కుక్కర్ గిన్నె తీసుకోవాలి. అందులో ఎంత వరకు మాడిందో అక్కడి వరకు నీళ్లు పోసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ పిండుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నీటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిస్తున్నప్పుడు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
- నీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
- చల్లారిన తర్వాత ఆ నీటిని పారబోసి స్క్రబ్బర్ సాయంతో రుద్దితే మాడిన మరకలు పోయి కుక్కర్ ఈజీగా శుభ్రపడతుంది.
కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతోందా? అయితే ఈ టిప్స్ పాటించండి!