BJP Released District Wise Presidents in Telangana : బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ ఆదేశానుసారం బీజేపీ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వాళ్లకు సోమవారం ఉదయం ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు వాట్సాఫ్ ద్వారా నియామక పత్రాలను పంపించారు.
11 జిల్లా అధ్యక్షుల ప్రకటనే తర్వాతే : మూడేళ్ల పాటు జిల్లా అధ్యక్షులు పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నప్పటికీ బీజేపీ సంస్థాగతంగా 38 జిల్లాలను ఏర్పాటు చేసుకుంది. నూతన అధ్యక్షుల ప్రకటనలో భాగంగా 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించగా, మిగతా 11 జిల్లాలకు నూతన రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తరువాతే నియమిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 6 రెడ్డి, 6 మున్నూరు కాపు, 4 గౌడ్స్, 2 వైశ్య, 2 ఎస్సీ,1 కమ్మ, ఆర కటిక, పద్మశాల, పెరిక, ముదిరాజ్‌లకు ఒక్కొక్కరి చొప్పున జిల్లా అధ్యక్షులను నియమించింది.
ఆర్ఎస్ఎస్ వ్యక్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలన్న నిబంధన ఏం లేదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
జిల్లా | పేరు |
జనగామ | సౌడ రమేశ్ |
వరంగల్ | గంట రవి |
హనుమకొండ | సంతోష్ రెడ్డి |
భూపాలపల్లి | నిశిధర్ రెడ్డి |
నల్గొండ | నాగం వర్షిత్ రెడ్డి |
నిజామాబాద్ | దినేష్ కులాచారి |
వనపర్తి | నారాయణ |
హైదరాబాద్ సెంట్రల్ | దీపక్ రెడ్డి |
మేడ్చల్ రూరల్ | శ్రీనివాస్ |
ఆసిఫాబాద్ | శ్రీశైలం ముదిరాజ్ |
కామారెడ్డి | నీలం చిన్నరాజులు |
ములుగు | బలరాం |
మహబూబ్‌నగర్ | శ్రీనివాస్ రెడ్డి |
జగిత్యాల | యాదగిరిబాబు |
మంచిర్యాల | వెంకటేశ్వర్లు గౌడ్ |
పెద్దపల్లి | సంజీవ రెడ్డి |
సికింద్రాబాద్ | మహంకాళి భరత్ గౌడ్ |