ETV Bharat / sports

ఆస్ట్రేలియన్‌ ఓపెన్​లో షాకింగ్ ఇన్సిడెంట్! - కోర్టు నుంచి బయటకు వచ్చి జకోవిచ్‌ సడెన్ రిటైర్మెంట్​! - AUSTRALIAN OPEN 2025

గాయం కారణంగా జకోవిచ్‌ సడెన్ వాకోవర్ - ఆస్ట్రేలియన్‌ ఓపెన్ ఫైనల్‌కు అలెగ్జాండర్ జ్వెరెవ్

Novak Djokovic
Novak Djokovic (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 24, 2025, 12:26 PM IST

Novak Djokovic Australian Open 2025 : సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్​ను గాయం ఇబ్బంది పెట్టింది. దీంతో కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ను నెగ్గాలనే లక్ష్యం నిరాశగానే మిగిలింది. తాజాగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో జరిగిన ఈ ఘటన జకోవిచ్ అభిమానులను కలచివేసింది. తాజాగా జరిగిన సెమీస్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ తర్వాత జకోవిచ్ వాకోవర్ ఇచ్చేశాడు. అయితే గాయం కారణంగానే అతడు ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్లు వెల్లడించి, తన అభిమానులకు అభివాదం చేస్తూనే కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు.

జకోవిచ్​ చేసిన ఈ పనితో స్టేడియంలోని వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే జకోవిచ్ వైదొలగడం వల్ల జర్మనీ స్టార్ జ్వెరెవ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరగనున్న రెండో సెమీస్‌లో విజేతగా నిలవనున్న ప్లేయర్​తో జ్వెరెవ్​ టైటిల్‌ కోసం పోరాడనున్నాడు.

ఇక ఇటలీకి చెందిన డిఫెండింగ్ ఛాంపియన్‌ సినర్‌తో అమెరికా స్టార్ బెన్ షెల్టన్ మరో సెమీస్‌లో తలపడనున్నాడు. ఆదివారం ఆస్ట్రేలియా ఓపెన్​ ఫైనల్‌ జరగనుంది.

తొలి సెట్‌ ఎలా సాగిందంటే?
తొలి సెమీస్‌ ఎంతో హోరా హోరీగా సాగింది. ఇద్దరూ స్టార్స్​ ఒకరికొకరు గట్టిపోటీ ఇచ్చుకుంటూ ఓ వైపు గాయం బాధ పెడుతున్నప్పటికీ, జకోవిచ్‌ ఏమాత్రం పట్టువదల్లేదు. అయితే జ్వెరెవ్‌ కూడా దూకుడుగానే ఆడాడు. సుమారు గంట 21 నిమిషాల పాటు సాగిన తొలి సెట్‌ను 7-6 (7/5) తేడాతో జ్వెరెవ్‌ సొంతం చేసుకున్నాడు. ఇక ఒక్కో పాయింట్‌ కోసం ఇద్దరు తీవ్రంగా పోరాడుతూ ఒకరి సర్వీస్‌ను మరొకరు బ్రేక్‌ చేసుకుంటూ గేమ్​ను సాగించారు. కానీ చివరికి జ్వెరెవ్​దే పైచేయిగా నిలిచింది. దీంతో మొదటి సెట్‌ ముగియగానే జకోవిచ్ మ్యాచ్​ నుంచి వైదొలిగి అందరినీ షాక్​కు గురిచేశాడు.

ఇటీవలే త‌న‌పై విష‌ప్ర‌యోగం జ‌రిగిన‌ట్లు తెలిపాడు. 2022లో మెల్​బోర్న్​లోని ఓ హోట‌ల్​లో త‌న‌కు విష‌పూరిత ఆహారం ఇచ్చిన‌ట్లు పేర్కొన్నాడు. సీసం, పాద‌ర‌సం క‌లిసి ఉన్న ఆహారాన్ని ఇచ్చి త‌న‌ను ఇబ్బందిపెట్టిన‌ట్లు వెల్లడించాడు.

ప్రేక్షకులపై జకోవిచ్​ ఫైర్​ - ఇంటర్వ్యూ మధ్యలో నుంచే జంప్​! - Novak Djokovic Fire on Audience

జకోవిచ్ ఎక్కడున్నా కలుస్తా- అతడితో కాఫీకి రెడీ: విరాట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.