ETV Bharat / sports

వీరేంద్ర సెహ్వాగ్‌ జంట విడిపోనుందా? - అందుకే ఆ ఇద్దరూ అలా హింట్ ఇచ్చారా! - VIRENDER SEHWAG DIVORCE

మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్‌ జంట విడిపోనుందా? - సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్

Virender Sehwag Divorce
Virender Sehwag (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 24, 2025, 8:42 AM IST

Virender Sehwag Divorce : భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నారన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. తన భార్య ఆర్తి అహ్లావత్‌తో ఆయన విడిపోయేందుకు సిద్ధమైనట్లు ఆ కథనాల్లో ఉన్నాయి. అయితే ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం వల్ల ఈ విడాకుల రూమర్స్​ తెరపైకి వచ్చాయని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకూ అటు సెహ్వాగ్‌ కానీ ఇటు ఆర్తి కానీ ఈ విషయంపై స్పందించలేదు. దీంతో రూమర్స్​ నిజమేనని క్రీడావర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

2004 డిసెంబరులో వీరేంద్ర సెహ్వాగ్‌, ఆర్తి అహ్లావత్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఆర్యవీర్‌, వేదాంత్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు సాగిన వీరి వైవాహిక బంధంలో కొన్ని నెలల కిందట మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఇద్దరూ కొంతకాలంగా విడివిడిగానే ఉంటున్నట్లు సమాచారం.

అయితే సెహ్వాగ్‌ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోల్లో సతీమణి కన్పించకపోవడం వల్ల ఈ ఇద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. గతేడాది దీపావళికి కూడా సెహ్వాగ్‌ తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను మాత్రమే పంచుకున్నారు. కానీ చివరిసారిగా 2023లో తమ పెళ్లి రోజు సందర్భంగా భార్యతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్తిని ఆయన ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం వల్ల ఈ రూమర్స్​కు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.