India Vs England 4th Test :రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా విజయం సాధించింది. ఇంగ్లీష్ జట్టు నిర్దేశించిన 192 పరుగులను ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. నాలుగో రోజును 40/0 స్కోరుతో ప్రారంభించిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ లక్ష్యచేధనలో సక్సెస్ సాధించింది. ఇక భారత జట్టులో రోహిత్ శర్మ (55), యశస్వీ జైస్వాల్ (37) రాణించగా, ధ్రువ్ జురెల్ (39*)ఎప్పటిలాగే కీలక ఇన్నింగ్స్ఆడిజట్టును ఆదుకున్నాడు.ఇక జురెల్‌తో పాటుశుభ్మన్ గిల్ (52*) జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. అర్ధశతకంతో రాణించాడు. ఆరో వికట్ సమయానికి ధ్రువ్, గిల్ 72 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను జోడించారు.
మరోవైపు యంగ్ ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ డకౌట్లుగా పెవిలియన్ బాట పట్టారు. రవీంద్ర జడేజా (4) కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లతో రాణించగా, టామ్ హార్ట్‌లీ, జోరూట్ చెరో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఇక రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలకంగా ఉన్న ధ్రువ్ జురెల్‌ను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది.