తెలంగాణ

telangana

ETV Bharat / sports

రఫ్పాడించిన హర్మన్, రిచా- UAEపై భారత్ ఘన విజయం - Asia Cup 2024 - ASIA CUP 2024

IND W vs UAE W Asia Cup: మహిళల ఆసియా కప్​లో టీమ్ఇండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా 78 పరుగుల తేడాతో నెగ్గింది.

ASIA CUP 2024
ASIA CUP 2024 (Source: Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 5:20 PM IST

IND W vs UAE W Asia Cup:మహిళల ఆసియా కప్​లో టీమ్ఇండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆదివారం దంబుల్లా వేదికగా యూఏఈని భారత మహిళల జట్టు చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా 78 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యూఏఈ ఓవర్లన్నీ 123-7 ఆడి పరుగులే చేయగలిగింది. కెప్టెన్ ఈషా రోహిత్ ఓజా (38 పరుగులు), కవీషా ఇగోడగె (40 పరుగులు*) మాత్రమే ఆకట్టుకున్నారు. టీమ్ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 2, రేణుకా ఠాకూర్ సింగ్, తనుజా కన్వర్, పూజా వస్త్రకార్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ విజయంతో భారత్ దాదాపు సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఇక భారత్ తదుపరి మ్యాచ్​లో జులై 23 మంగళవారం నేపాల్​తో తలపడాల్సి ఉంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (13 పరుగులు) విఫలమైనా, షఫాలీ వర్మ (37 పరుగులు, 18 బంతుల్లో; 5x4, 1x6) జెట్ స్పీడ్​లో ఆడింది. ఇక వన్​డౌన్​లో వచ్చిన హేమలత (2 పరుగులు) నిరాశ పర్చింది. ఇక కెప్టెన్ హర్మన్​ప్రీక్ కౌర్ (66 పరుగులు, 47 బంతుల్లో; 7x4, 1x6) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది.

రఫ్పాడించిన రిచా
11.4 ఓవర్ వద్ద జెమిమా (14 పరుగులు) ఔటయ్యాక, రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది. ఇక హర్మన్​, రిచాతో కలిసి స్కోర్ బోర్డును నడిపించింది. అయితే హర్మన్ కాస్త నెమ్మదిగా ఆడినా, రిచా మాత్రం యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపించింది. బౌండరీలతో విరుచుకుపడుతూ 29 బంతుల్లోనే 64 పరుగులు చేసింది. అందులో 12 ఫోర్లు, 1 సిక్స్​ ఉంది. వీరిద్దరూ ఐదో వికెట్​కు 75 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్లో హర్మన్ రనౌట్​గా వెనుదిరిగింది.

స్మృతి, షఫాలీ మెరుపులు- పాక్​పై భారత్ గ్రాండ్ విక్టరీ - Womens Asia Cup 2024

'అది నా పని కాదు' - రిపోర్టర్​కు కౌంటర్ వేసిన హర్మన్ ప్రీత్‌ కౌర్! - Harmanpreet IND VS PAK Match

ABOUT THE AUTHOR

...view details