IND VS SL First ODI Rohith Sharma :ఇటీవలే శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ మూడు మ్యాచ్‌లు గెలుచుకుంది. ఈ రోజు శుక్రవారం నుంచి కొలంబోలో మొదలైన వన్డే సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ తిరిగొచ్చాడు. 2023 నవంబర్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత, మళ్లీ ఇప్పుడే రోహిత్ వన్డే ఆడుతున్నాడు.
అయితే ఇటీవల కాలంలో మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ తన తోటి ప్లేయర్స్‌ను తిట్టడం స్టంప్ మైక్‌లో, కెమెరాల్లో రికార్డ్ అయి వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న మొదటి వన్డేలోనూ ఇదే జరిగింది. స్టంప్ మైక్‌లో రికార్డ్ అయిన రోహిత్ మాటలు వైరల్‌గా మారాయి.
- దూబేని రోహిత్ ఏమన్నాడంటే?
టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 14 ఓవర్ శివమ్ దూబే బౌలింగ్ చేశాడు. ఓవర్‌లో నాలుగో బాల్ శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సాంక డౌన్ ది లైగ్ సైడ్ దిశగా వెళ్లింది. దానిని నిస్సాంక ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అప్పుడు బంతి కీపర్ కేఎల్ రాహుల్ చేతిలోకి వెళ్లింది. దీంతో భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. అప్పుడు దూబే రివ్యూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్ రోహిత్ శర్మను కోరాడు.
ఇది భారత జట్టులో చర్చకు దారితీసింది. బంతి వైడ్‌గా ప్రకటించగానే కేఎల్ రాహుల్‌తో మాట్లాడేందుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వెళ్లారు. కొద్దిసేపు చర్చించిన తర్వాత, వారు రివ్యూ అడగకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో విరాట్, హిట్‌మ్యాన్ తమ పొజిషన్స్‌కు తిరిగి వెళ్లేందుకు ముందుకు కదిలారు. ఆ సమయంలోనే బౌలింగ్ చేసిన దూబే, రోహిత్, రాహుల్ కన్వర్జేషన్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. అందులో రోహిత్‌తో తాను శబ్దం విన్నట్లు దూబే అన్నాడు.
అప్పుడు రోహిత్ మాట్లాడుతూ - ‘తుమ్ కో తో యే బోల్నా చాహీయే కీ బాట్ దుర్ హై యా ప్యాడ్ దూర్ హై. బ్యాట్ అగర్ దూర్ హై తో హూ బోల్ రహా హై 100% అవాజ్ అయా. (బ్యాట్ ప్యాడ్‌కు దూరంగా ఉందో లేదో మీరు తెలుసుకోవాలి.’ అని రోహిత్ కాస్త గట్టిగా బదులిచ్చాడు.
పరిస్థితిని అర్థం చేసుకున్న రాహుల్, దూబే ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. ‘ఐపీఎల్ మే వైడ్ బచ్ జాతా హై నా, ఇసీ లియే బోల్ రహా హై వో’ (ఐపీఎల్‌లో వైడ్‌లను కూడా రివ్యూ తీసుకోవచ్చు కదా, అందుకే దూబే అలా చెబుతున్నాడు)’ అని రాహుల్ అన్నాడు.
- గైక్వాడ్‌కు భారత జట్టు నివాళి
బ్లడ్ క్యాన్సర్‌తో సుదీర్ఘకాలంగా పోరాడుతూ మాజీ భారత ఆటగాడు, కోచ్ అన్షుమాన్ గైక్వాడ్(71), బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన స్మారకార్థం భారత క్రికెట్ జట్టు చేతికి నల్ల బ్యాండ్‌లను ధరించింది.