తెలంగాణ

telangana

ETV Bharat / sports

సింపుల్ లైఫ్, కానీ ఖరీదైన లగ్జరీ కార్లు - సర్ఫరాజ్ నెట్ వర్త్ ఎన్ని కోట్లంటే?

న్యూజిలాండ్​తో జరుగుతోన్న తొలి టెస్ట్​లో సెంచరీ బాదిన టీమ్ఇండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Sarfaraz khan Net worth
Sarfaraz khan Net worth (source Associated Press)

Sarfaraz khan Net worth :టీమ్ఇండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ కివీస్​తో జరుగుతున్న తొలిటెస్టులో అదరగొట్టాడు. సూపర్ ఇన్నింగ్స్​తో జట్టుకు లీడ్ అందించాడు. అయితే ముంబయికి చెందిన సర్ఫరాజ్ రంజీల్లోనూ ఇరగొట్టాడు. దేశవాళీ, ఐపీఎల్​లోనూ స్థిరంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ నెట్​వర్త్ ఎంత? అతడి దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ పై ఓ లుక్కేద్దాం.

రంజీల్లో అదుర్స్ -సర్ఫరాజ్ ఖాన్ 1997 అక్టోబరు 22న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్​పై ఆసక్తి ఉన్న సర్ఫరాజ్​ రంజీల్లో ఆడాడు. ఐపీఎల్​లో 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఎంట్రీ ఇచ్చాడు. అలాగే దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. 2022-23 రంజీ సీజన్​లో ఏకంగా 122.75 సగటుతో 982 పరుగులు బాదాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. తాజాగా కివీస్​తో జరుగుతున్న సిరీస్​లో చోటు దక్కించుకుని ఆదరగొడుతున్నాడు.

నెట్ వర్త్ ఎంతంటే? -అయితే సర్ఫరాజ్ నెట్​వర్త్ రూ.16.6కోట్లు అని పలు వెబ్​సైట్లు కథనాల్లో పేర్కొన్నాయి. ఈ సంపద బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్టులు, దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​ల ఫీజులు, ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్ షిప్​ల ద్వారా అతడికి వచ్చింది. 2021లో ఆర్​సీబీ నుంచి సర్ఫరాజ్ రూ.25లక్షలు పొందాడు. ఇలా ఐపీఎల్ ఆదాయం, ఎండార్స్​మెంట్లు, మ్యాచ్ ఫీజులు కలిపి సర్ఫరాజ్ భారీ సంపాదనకు కారణమయ్యాయి. అయితే ముంబయిలో తన పాత ఇంటిలోనే సర్ఫరాజ్ నివాసం ఉంటున్నాడు. ఎటువంటి లగ్జరీకి పోకుండా సాదాసీదా జీవనాన్ని సాగిస్తున్నాడు. రెనో డస్టర్ ఎస్​యూవీ (Renault Duster), ఆడి కారు సర్ఫరాజ్ దగ్గర ఉంది.
బ్రాండ్ వాల్యూ పెరిగే ఛాన్స్! -ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్​లోకి సర్ఫరాజ్ అడుగుపెట్టాడు. తాజాగా కివీస్​తో జరుగుతున్న టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. ఇలా స్థిరంగా రాణిస్తే సర్ఫరాజ్ ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. కాంట్రాక్టులు ద్వారా అదనంగా డబ్బులు వస్తుంటాయి.

సర్ఫరాజ్ కెరీర్ -టీమ్ఇండియా తరఫున మూడు 4 టెస్టులు ఆడిన సర్ఫరాజ్ 325 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉంది. అలాగే 50 ఐపీఎల్ మ్యాచ్​లు ఆడిన సర్ఫరాజ్ 585 పరుగులు బాదాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.

ABOUT THE AUTHOR

...view details