ETV Bharat / offbeat

చలికాలంలో మోకాళ్లు, కీళ్ల నొప్పులను తగ్గించే సూపర్​ లడ్డూ - ఇలా చేసుకుంటే టేస్ట్​ అదుర్స్​! - HOW TO MAKE FLAX SESAME SEEDS LADDU

- చలికాలంలో కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం -ఈ లడ్డూ తీసుకంటే వెంటనే రిలీఫ్​ అంటున్న నిపుణులు

How to Make Flax Sesame Seeds Laddu
How to Make Flax Sesame Seeds Laddu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2025, 1:40 PM IST

How to Make Flax Sesame Seeds Laddu: వాతావరణ మార్పుల కారణంగా చలికాలంలో చాలా మందిని శ్వాసకోస వ్యాధులు, మోకాళ్లు, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు ఇబ్బందులు పెడుతుంటాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే ఈ సీజన్‌లో ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి ఆహారాల్లో అవిసె, నువ్వుల లడ్డూ ముందు వరుసలో ఉంటుంది. పోషకాలతోపాటు అనేక రకాలుగా మనకు లాభాలను చేకూర్చే అవిసె గింజలు, నువ్వుల లడ్డూను తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. మరి, ఈ లడ్డూల తయారీకి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్​ విధానం ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • అవిసె గింజలు - 1 కప్పు
  • నువ్వులు - అర కప్పు
  • పల్లీలు - అర కప్పు
  • ఎండు కొబ్బరి పొడి - అర కప్పు
  • బెల్లం - 1 కప్పు
  • నీళ్లు - పావు కప్పు
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్​
  • నెయ్యి - 2 టేబుల్​ స్పూన్లు

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి సిమ్​లో పెట్టి కడాయి అవిసె గింజలు వేసి దోరగా వేయించుకుని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే కడాయిలో పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే నువ్వులు, ఎండు కొబ్బరిని కూడా విడివిడిగా వేయించుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఈ గింజలన్నీ చల్లారిన తర్వాత మిక్సిజార్​లోకి వేసుకుని విడివిడిగా గ్రైండ్​ చేసుకోవాలి. అంటే ముందుగా అవిసె గింజలు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత పల్లీలు, అనంతరం నువ్వులు, ఎండు కొబ్బరితురము కలిపి మెత్తగా చేసుకుని వీటన్నింటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇలా తీసుకున్న మిశ్రమాన్ని శుభ్రంగా కలిపి పక్కన పెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి బెల్లం, నీరు పోసి సిమ్​లో కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మరో పాన్​లోకి ఈ బెల్లం నీటిని వడకట్టాలి.
  • ఇలా వడకట్టిన తర్వాత స్టవ్​ ఆన్​ చేసి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి.
  • ఒక్కసారి తీగ పాకం వచ్చిందంటే స్టవ్​ను సిమ్​లో పెట్టి యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి ముందుగా పొడి చేసుకున్న మిశ్రమాన్ని వేసి కలపాలి.
  • మిశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం పిండిని తీసుకుని ముద్దలాగా చేసుకోవాలి. పర్ఫెక్ట్​గా వస్తే స్టవ్ ఆఫ్​ చేసుకోవాలి.
  • ఒకవేళ మిశ్రమం జోరుగా ఏమైనా ఉంటే మరో రెండు నిమిషాలు ఉడికించుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటూ నచ్చిన సైజ్​లో లడ్డూల్లా చుట్టుకుంటూ గాలి చొరబడని బాక్స్​లో స్టోర్​ చేసుకుంటే సరి.
  • ఎంతో టేస్టీగా మరెంతో హెల్దీగా ఉండే అవిసె,నువ్వుల లడ్డూ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

సూపర్​ పోషకాలు: నువ్వులలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, జింక్, మాలిబ్డినం, సెలీనియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇక అవిసె గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ బి, సి, డైటరీ ఫైబర్, సోడియం, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు. బెల్లంతో మంచి ఐరన్‌ లభిస్తుందని వివరిస్తున్నారు.

ప్రయోజనాలు ఇవే :

  • కొలెస్ట్రాల్​ తగ్గుతుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • చర్మ, జుట్టు సంబంధింత సమస్యలను తగ్గిస్తుందని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అంటున్నారు.
  • ఇంకా చలికాలంలో ఎముకలు, కండరాలను బలపరుస్తుందని, మోకాళ్లు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందని అంటున్నారు.

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "పెసరపప్పు సున్నుండలు" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అద్భుతం!

పోషకాలు దండిగా ఉండే "పల్లీ అటుకుల లడ్డు" - ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.