ETV Bharat / opinion

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నీటి కష్టాలు! - ముందే ముంచుకొచ్చిన నీటి కొరత దేనికి సంకేతం? - WATER CRISIS IN HYDERABAD

భాగ్యనగరాన్ని వెంటాడుతున్న నీటికష్టాలు - వాననీటి సంరక్షణ లేక అప్పుడే భూగర్భజలాలు ఖాళీ - ముందే ముంచుకొచ్చిన నీటి కొరత దేనికి సంకేతం?

Pratidhwani On Water crisis in Hyderabad
Pratidhwani On Water crisis in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2025, 1:29 PM IST

Pratidhwani On Water Crisis In Hyderabad : భాగ్యనగరాన్ని నీటికష్టాలు వెంటాడుతున్నాయి. సాధారణంగా ఏటా ఎప్పుడో మండు వేసవిలో వినిపించే మాట ఇది. కానీ ఈసారి చాలా ముందుగా, ఇప్పుడే రాజధానిలోని పలు ప్రాంతాలు నీటి కటకటను చవిచూస్తున్నాయి. అభివృద్ధికి చిరునామాగా ఆకాశహర్మ్యాలు ఎంత ఎత్తున వెలుస్తు న్నాయో అంతకుమించిన లోతులకు జారిపోతున్న భూగర్భ జలాలు సమస్య తీవ్రతను పెంచు తున్నాయి. నిజానికి ఈ ఏడాది వర్షాకాలంలో మంచి వానలే పడ్డాయి. అయినా ఎందుకీ నీటి కటకట? ముందే ముంచుకొచ్చిన నీటి కొరత దేనికి సంకేతం? అసలు భాగ్యనగరం నీటి అవసరాలు ఏమిటి? అందుబాటులో ఉన్న వనరులేంటి? వాన నీటి సంరక్షణ విషయంలో ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? ఇకనైనా దిద్దుకోవాల్సిన అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.