ETV Bharat / technology

QR కోడ్ స్కాన్​తో ఈజీగా, వేగంగా ఫైల్స్​ షేరింగ్- ఆండ్రాయిడ్​లో కొత్త ఫీచర్ - QUICK SHARE QR CODE FEATURE

ఆండ్రాయిడ్​ యూజర్లు ఫైల్స్​ షేర్​ చేసుకోవడం ఇక మరింత సులభం- క్విక్​ షేర్​లో సరికొత్త ఫీచర్​ తీసుకొచ్చిన గూగుల్

ఆండ్రాయిడ్​ యూజర్లు ఫైల్స్​ షేర్​ చేసుకోవడం ఇక మరింత సులభం- క్విక్​ షేర్​లో సరికొత్త ఫీచర్​ తీసుకొచ్చిన గూగుల్!
ఆండ్రాయిడ్​ యూజర్లు ఫైల్స్​ షేర్​ చేసుకోవడం ఇక మరింత సులభం- క్విక్​ షేర్​లో సరికొత్త ఫీచర్​ తీసుకొచ్చిన గూగుల్! (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2025, 3:40 PM IST

Quick Share QR Code Feature Android : ఆండ్రాయిడ్​ వినియోగదారులు ఇకపై ఒక్క క్లిక్​తో ఫైల్స్​ను సులభంగా షేర్​ చేసుకొవచ్చు! ఇదివరకే ఉన్న క్విక్​ షేర్​ టూల్​లో సరికొత్త యూఆర్​ కోడ్ ఫీచర్​ను తీసుకొస్తోంది గూగుల్. గతేడాది మేలో ఈ ఫీచర్​ను టెస్ట్​ చేసిన కంపెనీ, త్వరలో ఆండ్రాయిడ్​ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్​ ఉపయోగించి ఆండ్రాయిడ్ యూజర్లు ఒక్క క్లిక్​తో క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి ఫైల్స్​ షేర్​ చేసుకోవచ్చు.

యాపిల్​ ఫోన్లలో ఉండే 'ఎయిర్​డ్రాప్'​లా, ఆండ్రాయిడ్​ డివైజ్​ల్లో ఫైల్స్​ షేర్​ చేసుకోవడానికి క్విక్​ షేర్ ఉపయోగపడుతుంది. ఈ టూల్​లోనే ఇప్పుడు సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది గూగుల్​. ఇంతకుముందు యూజర్లు ఫొటోలు, ఫైల్స్​ షేర్ చేసుకునేందుకు క్విక్​ షేర్​లో యాప్​లో కాంటాక్టులు లేదా నియర్​బై షేర్​ ఆప్షన్​ను ఆన్​ చేయాల్సి వచ్చేది. అప్పుడు రిసీవర్​ డివైజ్​ పేరు సెండర్​ ఫోన్​లో కనిపిస్తేనే ఫైల్స్​ షేర్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఇందులో కొత్తగా క్యూఆర్​ కోడ్​ ఫీచర్​ను జోడించారు.

ఎలా పని చేస్తుంది?
క్విక్​ షేర్​ టూల్​లో 'సెండ్​ టు నియర్​బై డివైజెస్​' పేన్​లో క్యూర్​ కోడ్​ ఆప్షన్​ ఇచ్చారు. దానిపైన క్లిక్​ చేస్తే ఒక క్యూఆర్​ కోడ్​ వస్తుంది. దాని పక్కన నంబర్​, యూజర్ ఏ రకం ఫైల్స్​ పంపించాలనుకుంటున్నారనే వివరాలు ఉంటాయి. అనంతరం ఫైల్స్​ రిసీవ్​ చేసుకునే యూజర్​ ఆ క్యూ ఆర్​ కోడ్​ను స్కాన్ చేసి క్విక్​ షేర్​ లింక్​పై క్లిక్​ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒరిజినల్​ ఫైల్స్​ ట్రాన్స్​ఫర్​ అవుతాయి.

ఈ కొత్త ఫీచర్​ వల్ల కాంటాక్ట్​ల కోసం సెర్చ్​ చేయడం, నియర్​బై డివైస్​ పేరింగ్​ సమస్య తీరిపోతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్​ డివైజ్​లు క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేయొచ్చు. దీంతో ఒకేసారి మల్టిపుల్ డివైజ్​లకు ఒరిజినల్​ ఫైల్స్​ పంపించొచ్చు. అయితే గూగుల్​ ఇప్పుడిప్పుడే ఈ ఫీచర్​ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తోంది. కనుక ఈ ఫీచర్​ను క్విక్​ షేర్​ లేటెస్ట్​ వెర్షన్​(వెర్షన్ 24.49.33) ఉన్నవాళ్లే ఉపయోగించుకోగలుగుతారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.