Yuzvendra Chahal Bigboss 18 : టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్న తరుణంలో తాజాగా చాహల్ ఫోటో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. తన కో ప్లేయర్స్ శ్రేయర్ అయ్యర్, శంశాక్ సింగ్తో కలిసి బిగ్బాస్ 18 సెట్లో కనిపించారు. అయితే 'వీకెండ్ కా వార్ స్పెషల్'లో భాగంగా బిగ్బాస్ 18లో వీరు అడుగుపెట్టే అవకాశాలున్నాయని బుల్లితెర వర్గాల్లో టాక్ నడుస్తోంది. తనపై రూమర్స్ ఊపందుకున్న నేపథ్యంలో ఆయన బిగ్బాస్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
Shreyas Iyer, Chahal and Shashank Singh at the Big Boss 18 set 👌 pic.twitter.com/ckB12mkvw4
— Johns. (@CricCrazyJohns) January 10, 2025
కాగా, ఇటీవల విడాకుల వార్తలపై ధనశ్రీ, చాహల్ స్పందించారు. "కొన్ని రోజులుగా నేను, నా ఫ్యామిలీ ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. అసలు నిజం ఎంటో తెలుసుకోకుండా అవాస్తవాలను రాస్తున్నారు. నాపై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారు. ఇది నన్ను ఎంతగానో బాధిస్తోంది. నేను ఈ స్థాయికి రావటానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాను. వాస్తవ పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని విలువలతో ముందుకుసాగాలని అనుకుంటున్నాను. నిజం ఎప్పటికైనా సరే విజయం సాధిస్తుంది. దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు" అని ధనశ్రీ ఇటీవలే పోస్ట్ షేర్ చేసింది.
'నిజం కావొచ్చు, కాకపోవచ్చు'
"నా అభిమానులు లేకుండా నేను ఇంత సాధించేవాడిని కాదు. వారి పట్ల ఎల్లప్పడూ గర్వంగానే ఉంటా. కానీ నా జర్నీ ఇంతటితో ముగియలేదు. నా దేశం, నా జట్టు కోసం ఇంకా మరెంతో సాధించాల్సి ఉంది. ఓ క్రీడాకారుడిగా, ఓ కుమారుడిగా, ఓ సోదరుడిగా, ఓ మిత్రుడిగా ఎంతో గర్వంగా ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం పట్ల అందరికీ కాస్త ఆత్రుతగా ఉంటుందని అర్థం చేసుకోగలను. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలు నిజం కావచ్చు, కాకపోవచ్చు!" అని చాహల్ స్పందించాడు.
ఇదీ జరిగింది!
చాహల్- ధనశ్రీ 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి దారి తీశాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత స్పందించిన చాహల్ తాము విడిపోవట్లేదని ఇటీవల తెలిపాడు.
చాహల్- ధనశ్రీ డివోర్స్? ఇన్స్టాలో అసలేం జరుగుతోంది?
చాహల్ భార్యను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఆమెను అలా అనుకున్నారుగా! - Yuzvendra Chahal Wife