Actor Allu Arjun Case Updates : అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడ్‌పల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని ఇది వరకు విధించిన షరతు నుంచి మినహాయింపునిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న అల్లు అభ్యర్థనను నాంపల్లి కోర్టు అంగీకరించింది.
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో సంథ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన ప్రైవేటు భద్రతా సిబ్బందినా పైనా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత అల్లు అర్జున్‌ను చిక్కడ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ పొందిన అల్లు అర్జున్ మరుసటి రోజే జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇది వరకే ఈ పిటిషన్‌పై విచారణ నిర్వహించిన నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సొంత పూచీకత్తు సమర్పించడంతో పాటు ప్రతి ఆదివారం చిక్కడ్‌పల్లి పోలీసుల ఎదుట హాజరయ్యి దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. దీంతో షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లాలని అల్లు అర్జున్ నాంపల్లి కోర్టును అభ్యర్థించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఆదివారం పీఎస్ ఎదుట హాజరు నుంచి మినహాయింపునివ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అల్లు అర్జున్ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన నాంపల్లి కోర్టు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీతేజ్‌ను పరామర్శించిన నటుడు అల్లు అర్జున్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రికి నిర్మాత దిల్ రాజుతో వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు ఏ విధంగా స్పందిస్తున్నాడనే విషయాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రితో కూడా మాట్లాడి కుటుంబానికి అండగా ఉంటానని, భరోసా కల్పించారు.
కిమ్స్ హాస్పిటల్‌కి అల్లు అర్జున్ - శ్రీతేజ్‌కు పరామర్శ
'ఆస్పత్రికి ఎప్పుడెళ్లినా మాకు సమాచారం ఇవ్వాలి' - అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు