How to Make Instant Biryani Within Minutes: "బిర్యానీలందు చికెన్ దమ్ బిర్యానీ వేరయా" అంటారు ఫుడ్ లవర్స్. మసాలా నషాళానికి తాకుతుంటే బిర్యానీని ఆస్వాదించడం అనిర్వచనీయమైన అనుభూతిగా ఫీలవుతుంటారు. అందుకే దీనికి ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంటుంది. సండే అయినా, రెస్టారెంట్స్‌కు వెళ్లినా, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఇలా వేడుకలు ఏవైనా "బిర్యానీ ప్లీజ్" అనాల్సిందే. పొగలు కక్కుతూ మసాలా ఘుమఘుమలతో మత్తెక్కించే బిర్యానీని తింటుంటే కలిగే ఫీల్ మరెందులోనూ రాదు.
అందుకే నేటి రోజుల్లో దిల్లీ నుంచి గల్లీ దాకా బిర్యానీ సెంటర్లు దర్శనమిస్తున్నాయి. అయితే, బిర్యానీ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. టైమ్ కూడా చాలా పడుతుంది. కానీ అదేమి లేకుండా, కేవలం నిమిషాల్లో వేడివేడి బిర్యానీ మీ చేతుల్లో ఉంటే ఎలా ఉంటుంది? ఏంటి నమ్మట్లేదా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
ప్రస్తుతం మార్కెట్లో ఏది తినాలన్నా ఇన్‌స్టంట్‌గా లభిస్తున్నాయి. అంటే ఏది తినాలనుకుంటే దానికి సంబంధించిన ప్యాకెట్ కొనడం అందులో వేడి నీళ్లు పోసి కొద్ది నిమిషాల తర్వాత తినడం. ప్రస్తుతం చాలా మంది చేసే పనే ఇది. ఇందుకు తగ్గట్టుగానే ఇన్స్టంట్ బిర్యానీ ప్యాకెట్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఈ ప్యాకెట్ల సాయంతో కేవలం 8 నిమిషాల లోపే రుచికరమైన బిర్యానీని తినొచ్చు.
ఇలా చేయాలి :
- ముందుగా ఇన్స్టంట్ చికెన్ బిర్యానీ ప్యాకెట్ కొనాలి. ప్యాకెట్‌తో పాటు మిక్సింగ్ డబ్బా కూడా అందులోనే ఉంటుంది.
- ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి, ఇచ్చిన డబ్బాలో పోయాలి. ఆ ప్యాకెట్లోనే చికెన్ ముక్కలు, మసాలాలు కలిపిన రైస్ ఉంటుంది.
- ఇప్పుడు అందులోకి ప్యాకెట్ మీద సూచించిన దాని ప్రకారం వేడి నీళ్లు పోసి కలుపుకోవాలి.
- ఆ తర్వాత కొన్ని నిమిషాల వరకు వెయిట్ చేస్తే బిర్యానీ రెడీ అయినట్లే. టేస్ట్ కూడా బాగుంటుంది.
- అప్పటికప్పుడు బిర్యానీ తినాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఇలాంటి ఇన్స్టంట్ బిర్యానీ ప్యాకెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.
బ్యాచిలర్స్ రెసిపీ "చికెన్ టిక్కా బిర్యానీ" - వంట రాని వారు కూడా ఈజీగా చేసేస్తారు!
చిట్టిముత్యాలతో స్పైసీ "మటన్ దమ్ బిర్యానీ"- ఇలా చేస్తే ఆ ఘుమఘుమలకే సగం కడుపు నిండిపోతుంది!