Ind vs Eng Lords Sourav Ganguly Celebration:టీమ్ఇండియా లెజెండరీ ప్లేయర్ సౌరభ్ గంగూలీ లార్డ్స్ మాస్ సెలబ్రేషన్స్‌కు శనివారం (జులై 13)తో 22ఏళ్లు పూర్తైంది. రెండు దశాబ్దాల కిందట గంగూలీ నేతృత్వంలోని టీమ్ఇండియా లార్డ్స్ మైదానం వేదికగా నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై చారిత్రక విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 49.3 ఓవర్లలో 8 కోల్పోయి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.
అయితే ఈ విక్టరీని బాల్కనీలో ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ గంగూలీ తన జెర్సీ తీసి మాస్ లెవెల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో ఇది సంచలనంగా మారింది. ఇది టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ విజయంలో అప్పటి జట్టులో సభ్యులు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్ అదరగొట్టారు.
325 లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఓపెనర్లు సెహ్వాగ్ (45 పరుగులు), గంగూలీ (62 పరుగులు) తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ఇక సచిన్ తెందూల్కర్ (14), ద్రవిడ్ (5) విఫలమయ్యారు. దీంతో మిడిలార్డర్లో యువరాజ్ సింగ్ (69 పరుగులు), మహ్మద్ కైఫ్ (87*) సూపర్ ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియాకు సూపర్ విక్టరీ అందించారు.