Yashasvi Jaiswal Next India Captain :టీమ్ఇండియా తదుపరి కెప్టెన్‌గా ఎవరొస్తారు? రోహిత్ శర్మ వారసుడు ఎవరనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి చర్చ జరిగింది. ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ స్టార్ బ్యాటర్, బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో టెస్టుల నుంచి కూడా హిట్‌మ్యాన్ తప్పుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మరి కొంత కాలం సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు.
'బుమ్రా విషయంలో అనుమానాలు!'
అయితే, జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే వరకు రోహిత్ టెస్టు జట్టులో కొనసాగనున్నట్లు సమాచారం. దీంతో రోహిత్ వారసుడు ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం టీమ్ఇండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రాపై చర్చ నడుస్తోంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకుంటే బుమ్రా జట్టుకు సారథ్య బాధ్యతలు వహించాడు. ఆ టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. ఇదంతా బాగానే ఉన్నా బుమ్రా ఫిట్‌నెస్ మీద సందేహాలు నెలకొనడం, టెస్టు కెరీర్‌ను ఎంతమేర పొడిగించుకోగలడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అతడికి కెప్టెన్ బాధ్యతలు అప్పగించే విషయంలో సెలక్టర్లు, కోచ్ ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.