Foreign Cricketers Favourite Indian Food:ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని భారత్‌కు విదేశీ క్రికెటర్ల రాక మొదలైంది. దిగ్గజ ఆటగాళ్ల నుంచి అన్‌క్యాప్డ్ ప్లేయర్ల వరకూ ఎందరో ఆటగాళ్లకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడికి వస్తున్న విదేశీ ఆటగాళ్లు నెలల తరబడి ఇక్కడే ఉండాల్సి వస్తోంది. అందుకే ఓ పక్క ఆట ఆడుతూనే ఇక్కడి ఫుడ్ ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు. భారతీయ బిర్యానీకి కొందరు, చికెన్ కబాబ్కు మరికొందరు బట్టర్ చికెన్‌కు ఇంకొందరు ఆటగాళ్లు ఫిదా అయిపోయారు. అయితే కొందరు విదేశీ క్రికెటర్లు ఏ భారతీయ వంటను ఎక్కువగా ఇష్టపడతారో ఓసారి చూద్దాం.
బటర్ చికెన్ టేస్ట్‌కు ఫిదా
విదేశీయులకు నచ్చే ఇండియన్ ఫుడ్‌లో బటర్ చికెన్ టాప్‌లో ఉంది. ఎందుకంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రోటీస్, నాన్స్, వెజ్ పులావ్ వంటి వాటిల్లో తింటే అదిరిపోతుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇందులో చికెన్‌ను అలా నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది. ముఖ్యంగా దక్షిణఫ్రికా ఆఫ్రికా ఆటగాళ్ళు డేవిడ్ మిల్లర్, లుంగీ ఎంగిడి, హెన్రిచ్ క్లాసన్ బటర్ చికెన్ అంటే పడి చచ్చిపోతారు. మాక్స్ వెల్ గురించి అయితే చెప్పనవసరమే లేదు. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక అయితే తనకి ఇండియన్ థాలీ అంటే ఇష్టం అని చెబుతాడు. రకరకాల ఆహారా పదార్ధాలు కొంచం కొంచంగా ఉండే థాలీని తను బాగా ఎంజాయ్ చేస్తానని ఓ సందర్భంలో చెప్పాడు.