Prithviraj Sukumaran About Prabhas : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌కు బయటనే కాకుండా సోషల్ మీడియాలోనూ కొన్ని మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ తను మాత్రం తన లైఫ్‌స్టైల్ గురించి నెట్టింట రేర్‌గానే పంచుకుంటుంటారు. కేవలం సినిమాకు సంబంధించిన విషయాలపైనే అప్‌డేట్లు ఇస్తూ కనిపిస్తారు. అయితే తాజాగా ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్ గురించి ఓ సీక్రెట్‌ను మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రివీల్ చేశారు. అంతేకాకుండా ఆయన ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"పెద్ద స్టార్ అయినా సరే ప్రభాస్ ఎంతో సింపుల్‌గా ఉంటారు. స్టార్‌డమ్ గురించి తను అసలు ఆలోచించరు. సోషల్ మీడియాపై కూడా తనకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. అయితే ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చే పోస్ట్‌లు షేర్ చేసేది కూడా ఆయన కాదు. ఈ మాట చెప్పి నేను మిమల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. ఆయనకు చిన్న చిన్న ఆనందాలంటేనే ఇష్టం. ఫామ్‌హౌస్‌లో తను ఎంతో సంతోషంగా ఉంటారు. ఎక్కడైనా సరే మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్దాం అని ఎప్పుడూ అంటుంటారు. అంత పెద్ద స్టార్ అయినా సరే ఇలా చిన్న ఆనందాలను కోరుకోవటాన్ని నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతాను" అని పృథ్వీ రాజ్ అన్నారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో దిగ్గజ డైరెక్టర్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు పృథ్వీరాజ్. 'బాహుబలి' తర్వాతనే హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడం ప్రారంభించారని ఆయన తెలిపారు. "బాహుబలి'కి ముందు ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ వచ్చినప్పటికీ 'బాహుబలి 2' రికార్డు స్థాయిలో విజయం సాధించడంతో పార్ట్2లపై ఆసక్తి ఎక్కువైంది. ఇటీవల వచ్చిన ‘పుష్ప 2’ కూడా సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అలాగే త్వరలోనే 'సలార్ 2' కూడా రానుంది" అని చెప్పారు.
ప్రస్తుతం పృథ్వీరాజ్ 'లూసిఫర్ 2 :ఎంపురాన్' అనే సినిమాతో బిజీగా ఉన్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆదరించిన 'లూసిఫర్' ఈ చిత్రం అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు ‘లూసిఫర్ 2: ఎంపురాన్ పేరిట ప్రీక్వెల్ కమ్ సీక్వెల్‌ను రూపొందించారు. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
షారుక్, సల్మాన్‌ను బీట్ చేసిన ప్రభాస్, బన్నీ- ఇండియా నెం 1హీరో మన డార్లింగే!
ప్రభాస్‌పై కిచ్చా సుదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్- డార్లింగ్ అలా ఉంటారట!