తెలంగాణ

telangana

ETV Bharat / sports

జకోవిచ్​కు షాకిచ్చిన 22 ఏళ్ల కుర్రాడు- ఆస్ట్రేలియన్​ ఓపెన్ నుంచి ఔట్

Djokovic vs Sinner Australian Open 2024: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ 2024 నుంచి ప్రపంచ నెంబర్​వన్​ ఛాంపియన్​ నొవాక్​ జకోవిచ్​ నిష్క్రమించాడు. సెమీస్​లో 22 ఏళ్ల ఇటాలియన్​ ప్లేయర్​ జనిక్‌ సినర్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు.

Big Shock To Novak Djokovic In Australian Open 2024 Semi Finals
Australian Open 2024 Sinner Vs Djokovic

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 4:36 PM IST

Updated : Jan 26, 2024, 6:38 PM IST

Djokovic vs Sinner Australian Open 2024:ఆస్ట్రేలియన్​ ఓపెన్​ 2024లో ప్రపంచ నెంబర్​వన్​ ఛాంపియన్​, సెర్బియన్​ టెన్నిస్​ స్టార్​ నొవాక్ జకోవిచ్​కు షాక్ తగిలింది. శుక్రవారం మెల్​బోర్న్ వేదికగా జరిగిన సెమీఫైనల్​లో జకోవిచ్, 22 ఏళ్ల ఇటలీ యంగ్ ప్లేయర్ జనిక్ సినర్ చేతిలో ఓడాడు. దీంతో మెల్​బోర్న్​ పార్క్​లో ఇప్పటివరకు జరిగిన 33 స్ట్రైట్​ మ్యాచుల్లో విజేతగా నిలిచిన జకోవిచ్ విజయ పరంపరకు బ్రేక్​ పడింది. ఈ గెలుపుతో నాలుగో ర్యాంకర్‌గా కొనసాగుతున్న జనిక్‌ సినర్‌ తన కెరీర్​లో మొదటిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌లో అడుగుపెట్టాడు.

సినర్​ ఒక్కటి- జకోవిచ్​ 8
జకోవిచ్​ ఈ సెమీస్​ మ్యాచ్​లో జనిక్‌ సినర్​కు అసలు పోటీనే ఇవ్వలేదు.సెమీస్‌లో జకోవిచ్‌ వరుసగా తొలి రెండు సెట్లలో 1-6, 2-6 వెనకబడ్డాడు. మూడో సెట్‌లో తీవ్రంగా పోరాడిన జకోవిచ్‌ 7-6 (8/6)తో కొద్దిసేపు మాత్రమే పోటీలో నిలబడ్డాడు. కానీ, నాలుగో సెట్‌లో విజృంభించిన సినర్‌ జకో ఆటకు బ్రేక్‌ వేసి 6-3తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఫలితంగా ఫైనల్​కు దూసుకెళ్లాడు. ఇక ఈ మ్యాచ్​లో జకోవిచ్‌ 29 అనవసర తప్పిదాలు, నాలుగు డబుల్‌ ఫాల్ట్స్‌ చేయగా- సినర్‌ కేవలం ఎనిమిది తప్పిదాలు, ఒక్కసారి ఫాల్ట్​ చేశాడు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2018 తర్వాత జొకోవిచ్‌కి ఇదే తొలి పరాభవం కావడం గమనార్హం.

వరల్డ్​ నెం.2 ర్యాంకర్​ ఔట్​!
Australian Open 2024 Carlos Alcaraz :ఇదివరకే వరల్డ్​ ఛాంపియన్​ లిస్ట్​లో నంబర్‌ 2 ర్యాంకర్​గా ఉన్న స్పెయిన్​ స్టార్​ కార్లోస్‌ అల్కరాస్‌ క్వార్టర్‌ ఫైనల్‌లోనే నిష్క్రమించాడు. తాజాగా జకోవిచ్​ కూడా ఇంటిదారి పట్టడంతో ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో మునుపెన్నడు నమోదుకాని సంచలను రికార్డ్​ అయింది. ప్రస్తుతం డానిల్ మెద్వెదెవ్‌ - అలెగ్జాండర్ జెరెవ్‌ మధ్య మరో సెమీఫైనల్ జరుగుతుంది. ఇందులో గెలిచిన ప్లేయర్​తో జనిక్‌ సినర్‌ ఫైనల్​లో టైటిల్​ కోసం తలపడనున్నాడు. జనవరి 28(ఆదివారం) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ పోరు జరగనుంది.

50వ ర్యాంకర్​ చేతిలో ఓటమి
ఆస్ట్రేలియన్​ ఓపెన్‌లో మరో సంచలనం రికార్డైంది. టైటిల్‌ ఫేవరెట్​, మహిళల సింగిల్స్​లో ప్రపంచ నెం.1గా ఉన్న పోలండ్​ షట్లర్​ ఇగా స్వైటెక్​కూ ఓటమి తప్పలేదు. ఈమె 3వ రౌండ్​లోనే రేస్​ నుంచి తప్పుకుంది. ఈ టోర్నీలో చెక్‌ రిపబ్లిక్​కు చెందిన ప్రపంచ 50వ ర్యాంకర్‌, అన్‌సీడెడ్​ ప్లేయర్ లిండా నోస్కోవా​ చేతిలో టాప్​ సీడ్​గా కొనసాగుతున్న స్వైటెక్ ఓడిపోయింది. 6-3, 3-6, 4-6 తేడాతో మ్యాచ్​ ముగిసింది.

'మ్యాచ్ ఫిక్సింగ్' కాంట్రవర్సీలో షోయబ్ మాలిక్- కాంట్రాక్ట్​ రద్దు చేసుకున్న ఫ్రాంచైజీ!

'5 సెంచరీలు చేసినా ఏం లాభం? ఓడిపోయాం కదా- జట్టులో ఆ మార్పు రావాలనుకున్నా!'

Last Updated : Jan 26, 2024, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details