ETV Bharat / technology

చౌకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా?- రూ.200లోపు ధరలో బెస్ట్ ఇవే! - RECHARGE PLANS UNDER RS 200

రీఛార్జ్ చేయిస్తున్నారా?- అయితే ఈ చౌకైన ప్లాన్లపై ఓ లుక్కేయండి!- వీటి ధర రూ.200లోపే!

Recharge Plans Under Rs. 200
Recharge Plans Under Rs. 200 (Photo Credit: IANS)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 12, 2025, 5:04 PM IST

Recharge Plans Under Rs.200: ప్రస్తుతం ప్రముఖ టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్​ల ధరలను పెంచేశాయి. ఈ పెరిగిన రీఛార్జ్ ధరలు వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా డ్యూయల్ సిమ్​లు ఉన్న వారు ఈ సమస్యతో మరింత ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో వచ్చే రీఛార్జ్ ప్లాన్లు లేవా? అంటే అవి కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా మన దేశంలో టాప్ 3 టెలికాం సంస్థలకు సంబంధించిన బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లపై ఓ లుక్కేద్దాం రండి. అది కూడా రూ. 200 లోపు ధరలోనే మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్లాన్లు మీకోసం. ఓ లుక్కేయండి మరి!

BSNL రూ. 107 రీఛార్జ్: ఈ బీఎస్​ఎన్​ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు డేటా, కాలింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ప్లాన్​ 50 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్, 3G డేటాను అందిస్తుంది. తక్కువగా కాల్స్ చేసే వినియోగదారులకు ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా ఈ ప్లాన్​తో పాటు 50 రోజుల పాటు ఉచితంగా BSNL ట్యూన్స్​ను కూడా పొందొచ్చు.

BSNL రూ. 153 రీఛార్జ్: ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెనిఫిట్​ లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ 28 రోజుల్లో వినియోగదారులు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేయొచ్చు. దీంతోపాటు ప్రతిరోజూ 1GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. 1GB లిమిట్ దాటిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40kbpsకి తగ్గుతుంది. దీనితో పాటు ప్రతిరోజూ 100 SMSలు కూడా లభిస్తాయి.

BSNL రూ. 199 రీఛార్జ్: బీఎస్​ఎన్​ఎల్ ఈ ప్లాన్​ నెల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్​ 30 రోజుల పాటు అన్​లిమిటెడ్ కాల్స్, రూ.153 రీఛార్జ్ కంటే ఎక్కువ డేటాను అందిస్తుంది. దీంతోపాటు ఇందులో రోజుకు 2GB డేటా లభిస్తుంది. ఈ లిమిట్ దాటిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 80kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్​లో 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. అంటే ఈ ప్లాన్ మొత్తంగా 30 రోజుల పాటు అన్​లిమిటెడ్ కాలింగ్, 60GB డేటా, 3వేల ఉచిత SMSలను అందిస్తుంది.

రూ. 199 జియో ప్రీపెయిడ్ ప్లాన్: మన దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్​ లిస్ట్​లో ఇది ఒకటి. ఈ ప్లాన్​లో యూజర్లకు రోజుకు 1.5GB డేటా లభిస్తుంది. దీంతోపాటు అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. కానీ ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు మాత్రమే.

ఈ ప్లాన్​లో యూజర్లు మొత్తం 27 జీబీ డేటాను పొందుతారు. అంతేకాక జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులు కూడా లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేదా అన్​లిమిటెడ్ 5G డేటాతో రాదని గమనించాలి.

ఎయిర్‌టెల్ రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్: భారతదేశపు రెండో అతిపెద్ద కంపెనీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్​లో వినియోగదారులు అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్, రోజుకు 100 SMSలు పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. కానీ ఈ 28 రోజులు మీకు 2 GB ఇంటర్నెట్ మాత్రమే లభిస్తుందని గుర్తుంచుకోండి.

ఈ ప్రయోజనాలన్నిటితో పాటు వినియోగదారులు ఈ ప్లాన్‌తో ఫ్రీ హలోట్యూన్స్​ లభిస్తాయి. అంతేకాక ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ నుంచి ఉచిత కంటెంట్‌ను కూడా పొందొచ్చు. అయితే ఈ ప్లాన్​తో కూడా వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా లేదా ఎయిర్‌టెల్ ఉచిత అన్​లిమిటెడ్ 5G డేటాను పొందలేరని గుర్తుంచుకోండి.

స్టన్నింగ్ లుక్​లో హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ వచ్చేసిందోచ్!- ధర ఎంతంటే?

ఒప్పో 'రెనో 13 5G' vs 'రెనో 13 ప్రో 5G'- ఈ రెండింటిలో ది బెస్ట్ స్మార్ట్​ఫోన్ ఇదే!

కొత్త బైక్ కొనాలా?- అయితే ఈ అప్డేటెడ్ సుజుకి మోటార్‌సైకిళ్లపై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.