11 Courses That Have Very Demand in Telangana : దేశంలో ప్రస్తుతం 11 సెక్టార్లలో నిపుణుల కొరత ఉందని వాటిలో ఇంజినీరింగ్ కోర్సులను తీసుకొస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నానో టెక్నాలజీ - సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీ, క్లైమేట్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, ఏఐ-రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి డిమాండ్ ఉన్న 11 రంగాలను గుర్తించామని వాటికి సంబంధించిన కోర్సుల్లో అధిక బీటెక్ సీట్లు ఉంటెలా ప్రోత్సహించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలికి సూచించింది. ఈ కోర్సులను ప్రస్తుతం కొన్ని కళాశాలలో అందిస్తున్నాయని, వాటికి ఉద్యోగావకాశాలు ఎక్కువ ఉండటం వల్ల విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరింది. 11 రంగాల్లో ఆయా కళాశాలలకు అదనపు సీట్లు మంజూరు చేయవచ్చని తెలిపింది. ఈ కోర్సులను బోధించేందుకు పరిశ్రమలకు చెందిన నిపుణలను నియమించుకోవాలని వివరించింది. సిలబస్ తయారీలోనూ పరిశ్రమల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించింది. కోర్సుల కోసం, నిపుణుల తయారీకి ఈ రంగాలపై పనిచేసే పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేకంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ రీసెర్చ్ల్యాబ్లు లేదా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను నెలకొల్పాలని తెలిపింది. ఈ కోర్సులను ప్రవేశపెట్టిన కళాశాల్లో నవకల్పన, ఇంక్యూబేషన్, స్టార్టప్‌లను ప్రోత్సహించాలని తెలిపింది. ఈ మేరకు ఏఐసీటీఈకి నివేదిక సమర్పించి ఆయా రంగాల గురించి వివరించింది.
ఇకనుంచి అదనపు సీట్లకు, కొత్త కోర్సుల మంజూరుకు 5 కొలమానాలను పరిగణలోకి తీసుకొని ఎన్వోసీ జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ప్రస్తుతం ఉన్న కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు, కళాశాల ట్రాక్రికార్డు, మౌలిక వసతులు, అధ్యాపకులు; ప్రాంగణ నియామకాలు - పరిశ్రమలతో ఒప్పందాలు; ఎన్బీఏ, న్యాక్ అక్రిడిటేషన్, ఎన్ఐఆఫ్ఎఫ్ ర్యాంకింగ్; కొత్త కళాశాలలు, కోర్సులు, సీట్లపై రాష్ట్ర ప్రభుత్వ విధానం.. వీటిని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
స్కిల్స్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు - జాయిన్ అయితే చేతిలో జాబ్ ఉన్నట్లే!
- నానో టెక్నాలజీ - సెమీకండక్టర్స్ : టెక్స్టైల్స్, మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ పరిశ్రమల్లో నానోటెక్నాలజీ, సెమీకండక్టర్లకు మంచి డిమాండ్ ఉంది. ఎక్కువకాలం మన్నే నిర్మాణ మెటీరియల్, కాన్సర్ చికిత్స, టీకాలు, హైడ్రోజన్ ఫ్యూయల్సెల్స్, నానోగ్రాఫిన్ బ్యాటరీలు వంటివాటిపై దృష్టి సారించాలి.
- ఏరోస్పేస్ ఇంజనీరంగ్, స్పేస్ టెక్నాలజీస్ : అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ గణనీయంగా వృద్ధి చెందుతోంది. శాటిలైట్ కమ్యూనికేషన్స్, ప్రైవేట్ స్పేస్ఎక్స్పోరేషన్, రక్షణ రంగం డిమాండ్ ఉంది.
- డిఫెన్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ : దేశాల మధ్య జియోపొలిటికల్ వివాదాల కారణంగా రక్షణ రంగంలో నిపుణులకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరగనుంది. స్మార్ట్ వెపన్ సిస్టమ్స్, మిలిటరీ గ్రేడ్ఏ1, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, డ్రోన్ టెక్నాలజీ విభాగలపై దృష్టి సారించాలి.
- క్లైమేట్ ఇంజినీరింగ్, సస్టెయినబుల్ టెక్నాలజీస్ : కాలుష్యరహిత ప్రపంచ దిశగా పరిస్థితులు మారుతున్నందున రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీస్, కార్బన్ క్యాప్చర్ తదితర అంశాలను ప్రధాన్యత తెలుసుకోవాలి
- బయోటెక్నాలజీ, జినోమ్ ఇంజినీరింగ్ : వైద్య, ఆరోగ్య రంగంలో సవాళ్లు, ఆహార భద్రత సమస్యలు పెరుగుతున్నందున బయోటెక్నాలజీ అవసరం మరిత పెరిగింది. సింథటిక్ బయోలజీ, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులు అవసరం.
- ఏఐ, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ : పరిశ్రమలు ఆటోమోషన్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ, కాగ్నిటివ్ రోబోటిక్స్, ఏఆర్ అండ్ వీఆర్ తదితర వాటిల్లో కోర్సుల అవసరం.
- మెరైన్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్ : రెన్యువబుల్ విద్యుత్తుపై దృష్టి పెరిగినందున నీటి కింద అన్వేషణ, మెరైన్ రోబోటిక్స్, సముద్రాలను సంరక్షించుకునే సాంకేతికత తదితర అంశాలకు డిమాండ్ పెరుగుతోంది.
- క్వాంటమ్ కంప్యూటింగ్, టెక్నాలజీస్ : డేటాసెక్యూరిటీ, డేటాఎనాలిసిస్కు డిమాండ్ ఉన్నందున క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో కోర్సులను ప్రవేశపెట్టాలి.
- ఫుడ్ టెక్నాలజీ, అగ్రిటెక్ : ప్రపంచ వ్యాప్తంగా సుస్థిర ఆహార ఉత్పత్తి అవసరం పెరుగుతోంది. స్మార్ట్ఫార్మింగ్, ఆల్టర్నేటీవ్ ప్రోటీన్లు, అగ్రికల్చరల్ డ్రోన్లు, పుడ్‌సెక్యూరిటీ వంటివాటిలో పెద్దఎత్తున నిపుణుల అవసరం.
- హెల్త్‌కేర్ టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ :మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులను సైతం పర్యవేక్షించేందుకు వైద్యరంగం కూడా డిజిటల్ రూపంలోకి మారుతోంది. టెలిమెడిసిన్ ఫ్లాట్‌ఫామ్స్, హెల్త్‌కేర్ రోబోటిక్స్, ఏఐ డయాగ్నస్టిక్స్ ధరించేందుకు వీలున్న వైద్య పరికరాలు వంటివాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆసుపత్రులు, హెల్త్- టెక్ స్టార్టప్స్, 3డీ ప్రింటింగ్ ద్వారా బయోమెడికల్ ఇంప్లాంట్స్ తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవచ్చు.
- అర్బన్ ఇన్‌ఫ్రా, స్మార్ట్ సిటీస్ : పట్టణీకరణ పెరుగుతున్నందున ఐఓటీ స్మార్ట్ సిస్టమ్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రెన్యువబుల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిష్కారాలు వంటివాటికి అత్యధిక డిమాండ్ ఉంది.
న్యూ ఇయర్ నుంచి 'ఏఐ కోర్సులు' - 14 వేల విద్యాసంస్థలకు ఏఐసీటీఈ లేఖ
మీరు ఏటీసీలో విద్యార్థులా? - ఈ విద్యా సంవత్సరం నుంచే 6 కొత్త కోర్సులు ప్రారంభం