Dhoni CSK Retirement :2025 ఐపీఎల్ సీజన్‌కు మరి కొన్ని నెలల్లో సన్నాహకాలు మొదలవుతుందన్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీని బట్టి ఆ జట్టు ప్లేయర్ ఎంఎస్ ధోనీ రానున్న సీజన్లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. ఇంతకీ ఏమైందంటే?
మేజర్ మిస్సింగ్
చెన్నై ఫ్రాంచీజీ తాజాగా సోషల్ మీడియాలో 'మేజర్ మిస్సింగ్' అనే క్యాప్షన్‌తో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ధోనీ నంబర్ 7 జెర్సీని కూడా పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు అభిమానుల్లో గందరగోళం సృష్టించింది. దీంతో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటాడంటూ సోషల్ మీడియాలో అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ధోనీ కోసం చెన్నై ఫ్రాంచైజీ ఇప్పుడు ఓ పాత రూల్‌ను మళ్లీ అమలు చేయాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. అదేంటంటే ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆటగాళ్లను అనామక ఆటగాళ్లుగా పరిగణించేవాళ్లు. ఈ రూల్ 2018 వరకు అమలులోనే ఉండేది. అయితే ఇప్పుడు ఈ రూల్‌ను ధోనీ కోసం తీసుకుని రావాలని సీఎస్‌కే డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇతర ఫ్రాంచైజీల నుంచి వ్యతిరేకం వస్తోంది.