ETV Bharat / technology

త్వరలో ఇండియన్ మార్కెట్​లోకి అతి పెద్ద ఈవీ కారు!- సింగిల్ ఛార్జ్​తో 580km రేంజ్​! - MG M9 EV

2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్న లగ్జరీ MPV 'MG M9'- ఎక్స్​పెక్టెడ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే!

MG M9 EV
MG M9 EV (Photo Credit- MG Indonesia)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 13, 2025, 8:01 PM IST

MG M9 EV: JSW MG మోటార్ ఇండియా తన అప్​కమింగ్ లగ్జరీ MPV 'MG M9' కారును 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది. ఈ లగ్జరీ MPVను 'ది MG సెలెక్ట్' షోరూమ్ ద్వారా భారత్​లోని ఆల్​-ఎలక్ట్రిక్ టూ-డోర్ స్పోర్టీ సైబర్‌స్టర్‌తో పాటు విక్రయించనున్నారు.

దీనిపై ఆన్‌లైన్‌లో పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్ట్​లో కారులోని సెకండ్ వరుసలో ఒట్టోమన్ సీట్లు, దాని హ్యాండ్‌రైల్‌పై టచ్‌స్క్రీన్ ప్యానెల్ ద్వారా నియంత్రించగల థ్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను హైలైట్ చేసి చూపించారు. ముఖ్యంగా అదే టచ్‌స్క్రీన్‌ను మసాజ్ మోడ్​లను కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగించొచ్చని దీని ద్వారా వెల్లడించారు. కానీ అందులో కంపెనీ దీనిపై ఎక్కువ సమాచారాన్ని అందించలేదు. అయితే ఈ కారుపై ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం మీకోసం.

MG M9 ఎక్స్​పెక్టెడ్ డిజైన్: M9 EV ఇప్పటికే గ్లోబల్​ మార్కెట్లలో విడుదలైంది. ఇప్పుడు ఈ మోడల్ ఇండియన్ స్పెసిఫికేషన్లతో భారత మార్కెట్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. గ్లోబల్ మార్కెట్లలో రిలీజ్​ అయిన ఈ లగ్జరీ MPV మోడల్ పొడవు 5,270mm, వెడల్పు 2,000mm, ఎత్తు 1,840mm. ఇక ఈ MPV వీల్‌బేస్ 3,200mm. ఈ ఎలక్ట్రిక్ MPV బాక్సీ డిజైన్‌లో గ్రిల్-లెస్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో 19-అంగుళాల CONTI SEAL టైర్లు, LED హెడ్‌ల్యాంప్‌లు, రియర్‌లైట్‌లు ఉంటాయి.

కలర్ ఆప్షన్స్: గ్లోబల్ మార్కెట్స్​లో ఈ MPV మూడు కలర్ ఆప్షన్​లలో అందుబాటులో ఉంది.

  • గ్రానైట్ గ్రే
  • పెర్ల్ వైట్
  • బ్లాక్ నైట్

ఇండియన్ వేరియంట్​లో MG M9లో అంచనా స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్: M9 EV 90kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది WLTP క్లెయిమ్డ్ 580km రేంజ్​ను కలిగి ఉంటుంది. MG అందించే 11kW ఛార్జర్ MPVని 5 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 8.5 గంటలు పడుతుంది. DC ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీని 30 నిమిషాల్లో 30 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ MPV 241 bhp పవర్ అవుట్‌పుట్, 350 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫీచర్లు: M9 EVలో ఫ్రంక్, ఆటోమేటిక్ ఆన్-ఆఫ్ LED హెడ్‌ల్యాంప్‌లు, LED రియర్ లైట్లు, DRLలు, డ్యూయల్ పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మీడియా స్ట్రీమింగ్ కేపబిలిటీలతో రియర్‌వ్యూ మిర్రర్, థ్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, సెకండ్-రో హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఒట్టోమన్ సీట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సీట్లను 12 విధాలుగా ఎలక్ట్రానికల్​గా అడ్జస్ట్ చేయొచ్చు. అంతేకాక ఇది ఎనిమిది మసాజ్ మోడ్స్​ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్లను దాని హ్యాండ్‌రైల్‌పై ఉన్న టచ్‌స్క్రీన్ ప్యానెల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. వీటితో పాటు ఈ MPV దాని ఆర్మ్‌రెస్ట్‌పై వైర్‌లెస్ ఛార్జర్, 220V పవర్ సాకెట్, ఫోల్డబుల్ టేబుల్, సెకండ్​-వరుసలో USB పోర్ట్‌లు ఉన్నాయి.

షాపింగ్ ప్రియులకు గుడ్​​న్యూస్- అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లో భారీ డిస్కౌంట్​ సేల్స్!- పోటాపోటీ ఆఫర్లు!

శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ రెండర్స్ లీక్- ఒక్కో మోడల్ స్పెక్స్ వివరాలు ఇవే!

ఐఓఎస్ డివైజ్​ యూజర్లకు అదిరే అప్​డేట్- గ్రోక్ ఏఐ కోసం అందుబాటులోకి సొంత యాప్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.