తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాపం, గంగూలీ ఆశలు ఆవిరి! - Delhi Capitals Ganguly - DELHI CAPITALS GANGULY

Delhi Capitals HeadCoach : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి నిరాశ ఎదురైనట్లు తెలిసింది. అతడు ఆశించిన పదవి దక్కేట్టు కనిపించడం లేదు. పూర్తి వివరాలు స్టోరీలో

source Getty Images
Ganguly (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 8:16 PM IST

Delhi Capitals HeadCoach : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి నిరాశ ఎదురైనట్లు తెలిసింది. ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్‌ కోచ్‌ కావాలని దాదా ఆశపడ్డాడు! కానీ ఆ ఫ్రాంచైజీ అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిసింది.

''ప్రస్తుతం దాదా దిల్లీ క్యాపిటల్స్​ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్​గా ప్రధాన బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన ఇతర బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. అయితే జట్టును దూకుడుగా సిద్ధం చేసే గౌతమ్ గంభీర్ లాంటి కోచ్ కోసం ఫ్రాంచైజీ ఎదురుచూస్తోంది. ఎవరినైనా తాత్కాలికంగా నియమించాలని ఫ్రాంచైజీ అనుకోవట్లేదు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది'' అని దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ వర్గాలు పేర్కొన్నాయి.

Delhi Capitals Ganguly :కాగా, ప్రస్తుతం గంగూలీ దిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా కొనసాగుతున్నాడు. అలాగే దిల్లీ క్యాపిటల్స్​కు సంబంధించిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ (ILT20), ప్రిటోరియా క్యాపిటల్స్‌ (SA20) బాధ్యతలను చూసుకుంటున్నాడు. ఇన్ని బాధ్యతలు ఉండడంతో దిల్లీ యాజమాన్యం గంగూలీకి అదనపు బాధ్యతలు ఇవ్వాలని అనుకోవట్లేదట. అందుకే హెడ్‌ కోచ్‌ పదవి కోసం అతడి పరిగణలోకి తీసుకోవడం లేదని సమాచారం అందింది. ఇకపోతే ఈ హెడ్ కోచ్ పదవి కోసం ఇద్దరు ముగ్గురు ప్రపంచకప్​ విన్నర్ల పేర్లను దిల్లీ యాజమాన్యం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Delhi Capitals Ricky Ponting :అంతకుముందు దిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం హెడ్ కోచ్​గా ఉన్న రికీ పాంటింగ్‌ను తప్పించింది. అతడి ఆధ్వర్యంలో దిల్లీ జట్టు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేదు. కేవలం ఒకే ఒక్కసారి (2020) ఫైనల్‌కు చేరింది. 2018లో మొదటిసారి పాంటింగ్‌ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన దిల్లీ జట్టు ఆ సీజన్‌లో చివరి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2019లో మూడో స్థానంలో, 2021 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇక గడిచిన మూడు సీజన్లలో ఐదు, తొమ్మిది, ఆరు స్థానాలతో సరిపెట్టుకుంది. అందుకే పాంటింగ్​పై వేటు వేసింది యాజమాన్యం. అయితే పాంటింగ్‌ను హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పించాక తనకు ఆ పదవిపై ఆసక్తి ఉన్నట్లు చెప్పాడు దాదా.

ఆ ప్లేయర్స్​కు షాకిచ్చిన బీసీసీఐ - గంభీర్ రాకతో మారిన రూల్స్​! - BCCI Test Cricketers

ఐసీసీ ర్యాంకింగ్స్​ - అదరగొట్టిన హర్మన్​ ప్రీత్​, షెఫాలీ - ICC T20 rankings

ABOUT THE AUTHOR

...view details